YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

టచ్‌ చేసారో.. వాట్సప్‌ యాప్‌ మొత్తం క్రాష్‌

 టచ్‌ చేసారో.. వాట్సప్‌ యాప్‌ మొత్తం క్రాష్‌

ఈ బ్లాక్‌ పాయింట్‌ను టచ్‌ చేస్తే మీ వాట్సప్‌ హ్యాంగ్‌‌ అవుతుందంటూ మీకు మెసేజ్‌ వచ్చిందా? ఏదో ఫన్నీగా ఎవరో ఈ పని చేస్తున్నారనుకుని దాన్ని టచ్‌ చేయకండి. దాన్ని టచ్‌ చేస్తే వాట్సప్‌ యాప్‌ మొత్తం నిజంగానే క్రాష్‌ అవుతుంది. వాట్సప్‌, ఫేస్‌బుక్‌ లాంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో లింకులు పంపుతూ.. దాని మీద క్లిక్‌ చేస్తే మీరో సర్‌ప్రైజ్‌ విషయాన్ని తెలుసుకుంటారంటూ కేటుగాళ్లు మెసేజ్‌లు పంపి మోసాలకు పాల్పడుతుండడం ఇప్పటివరకు చూశాం.ఒకవేళ ఆ లింకుని క్లిక్‌ చేస్తే కంప్యూటర్‌ లేక స్మార్ట్‌ఫోన్‌లు హ్యాకింగ్‌కు గురవుతాయి. ఇప్పుడు అటువంటి వాటిపై చాలా మంది నెటిజన్లకు అవగాహన వచ్చింది. దీంతో ఇప్పుడు కేటుగాళ్లు తమ రూటు మార్చి మరో విధమైన మెసేజ్‌లు పంపుతున్నారు. ఈ బ్లాక్‌ పాయింట్‌ను లేక ఎమోజీని టచ్‌ చేసి చూడండంటూ మెసేజ్‌లు పంపి మన స్మార్ట్‌ఫోన్లు హ్యాంగ్‌ అయ్యేలా చేస్తున్నారు.అలాగే, 'ఇది చాలా ఆసక్తికరంగా ఉంది' అంటూ ఓ మెసేజ్‌ పంపుతున్నారు. దాని పక్కనే నవ్వుతున్న ఎమోజీతో పాటు రీడ్‌ మోర్‌ అని ఉంటోంది. దాన్ని టచ్ చేసినా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఇటువంటి మెసేజ్‌లు ఈ మధ్య కాలంలో బాగా ఫార్వర్డ్‌ అవుతున్నాయి. వాటిపై క్లిక్‌ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇటువంటి మెసేజ్‌లలో అదృశ్యంగా కొన్ని సింబల్స్‌ ఉంటాయని అంటున్నారు.

Related Posts