YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాయపాటికి ఈ సారి రెండు...

రాయపాటికి ఈ సారి రెండు...

గుంటూరు, సెప్టెంబర్ 18, 
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై వత్తిడి పెరుగుతోంది. వచ్చే ఎన్నికలలో గెలుపోటములు ఎలా ఉన్నా సీనియర్ నేతలు మాత్రం చంద్రబాబును ఇబ్బంది పెట్టే పరిస్థితులే కన్పిస్తున్నాయి. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత తమను వచ్చే ఎన్నికలలో గట్టెక్కిస్తుందని చంద్రబాబు గట్టిగా విశ్వసిస్తున్నారు. అందుకే నేతలను యాక్టివ్ చేయడంతో పాటు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే సీనియర్ నేతలు మాత్రం షరతులు విధిస్తుండటం చంద్రబాబును ఇరకాటంలో పడేయడం ఖాయమని చెప్పక తప్పదు.సీనియర్ నేత రాయపాటి సాంబశివరావుది నిలకడలేని మనస్తత్వం. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఆయనకే తెలియదు. ఒకసారి పార్టీని పొగుడుతారు. మరొకసారి తెగ విమర్శలూ చేస్తారు. సీనియర్ నేత అయిన ఆయన మాటలకు విలువ ఉండటంతో పార్టీ కూడా కొంత ఆయన పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. తాజాగా రాయపాటి సాంబశివరావు చంద్రబాబును కలిశారు. చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇప్పుడు ఈజీ కావడంతో ఎవరికైనా సులువుగానే దొరుకుతుంది. దీంతో రాయపాటి చంద్రబాబును కలిసి తన మనసులో మాటలను చెప్పుకోగలిగారుఅయితే రాయపాటి సాంబశివరావు వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబానికి రెండు టిక్కెట్లు కావాలని కోరారు. తన కుమారుడికి సత్తెనపల్లి టిక్కెట్ తో పాటు కుమార్తెకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లేదా నరసరావుపేట పార్లమెంటు టిక్కెట్ ఇవ్వాలని కోరారు. చంద్రబాబు సమాధానం ఏం చెప్పారో తెలియదు కాని, రాయపాటి కోరిక తీర్చుకుంటే రచ్చ రచ్చ అవ్వడం ఖాయమన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.అసలే కమ్మ సామాజికవర్గం ముద్ర పడిన టీడీపీకి రాయపాటి సాంబశివరావు లాంటి నేతల డిమాండ్ల కారణంగా మరింత ఇబ్బందులు తలెత్తుతాయి. రెండు టిక్కెట్లలో ఏ ఒక్కటి ఇవ్వకపోయినా రాయపాటి సాంబశివరావు పార్టీ మీద, లేకుంటే చంద్రబాబు పైన కూడా శివాలెత్తే అవకాశాలున్నాయన్నది వాస్తవం. రెండు టిక్కెట్లు ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇలా ఎన్నికలు దగ్గరపడే కొద్దీ సీనియర్ నేతల డిమాండ్లు చంద్రబాబు ను రాజకీయంగా ఇబ్బంది పెట్టనున్నాయి

Related Posts