వినోదరంగంలో పెను మార్పులు పలు ప్రక్రియలు వచ్చిన నేపథ్యంలో తాజాగా విడుదలైన “హనీట్రాప్" చిత్రం ట్రెండ్ ను జయించింది. విలాసాలు, సంపద కోసం ఆడతనాన్ని ఎరవేసిన “హనీట్రాప్" లు వార్తల్లో విన్నాం. కానీ నైతిక విలువలు ఏమాత్రం లేని యువజంట అటు సంపన్నుల కూతురిని ముగ్గులోకి లాగి ఆనక డబ్బులు గుంజడం ఒక ట్రాక్ ( ట్రాప్) అయితే , తన గళ్ ఫ్రెండ్ ను ఎరగా వేసి బలవంతుడైన మంత్రి స్థాయి వ్యక్తిని కమ్మేయడం రెండో ట్రాక్ (ట్రాప్).
సెక్స్ ను, యవ్వనాన్ని పెట్టుబడిగా పెట్టి తమకు కావాల్సిన ఫలితం రాబట్టుకోవాలను కున్న జంట చివరికి జీవితంలో ఏమి సాధిచింది? తమ ఆశల పల్లకి అందుకున్నారా? గెలిచి ఓడారా ? ఓడి గెలిచారా?. సెక్స్ ను మోతాదులో చూపుతూ అసభ్యతకు తావివ్వకుండా వీలైన చోటల్లా లిప్ కిస్ లు, శృంగార సన్నివేశాలతో కిక్ ఇచ్చేలా కథను సమకూర్చారు. తదుపరి ఏమి జరుగుతుందనే ఉత్కంఠ ఒక వైపు, మన పిల్లలకే ఇలా జరిగితే అనే భయాందోళనలు మరో వైపు సీటులో కదలకుండా కూర్చోబెట్టి సినిమాను ఆసాంతం చూపించడంలో ఘటికుడనిపించారు కథ, స్క్రీన్ ప్లే సమకూర్చిన వి.వి. వామన్ రావు, వైజాగ్ అందాలను అద్భుతంగా చూపుతూనే కథా బిగువు సడలకుండా కెమెరా పనితనం కనబరిచారు కెమేరామ్యాన్
అర్థవంతమైన ఆధునికమైన సంగీతాన్ని అందించి మంచి కథకు, కథనానికి మరింత సొగసులు సొబబు గా అద్దారు మ్యూజిక్ డైరెక్టర్ ఇమ్మడి. శృంగార రసాన్ని మంచి కథనంతో ఎంత బాగా తీయవచ్చొ రుజువు చేసారు దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి. అటు సొంత ఊరు, గంగ పుత్రులు, వలస వంటి సమాంతర చిత్రాలతో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఆయన రొమాంటిక్ క్రైం స్టోరీ" తో మాస్ ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. ఇప్పుడు “హనీట్రాప్" తో ఓ టి టి, మల్టిప్లెక్స్ ప్రేక్షకులకు సరైన దర్శకుడిగా నిరూపించుకున్నారు. ఎలాంటి కథాంశాలతో ఓ టి టి ప్రేక్షకులను మెప్పించాలో అర్థం కాక సతమతం అవుతున్న ఓటిటి పరిశ్రమకు, నిర్మాతలకు “హనీట్రాప్" ఒక కొలమానం. ఒక మెచ్చుతునక . మారిన ట్రెండ్ అనే అలపై బాగా స్వారీ చేశారు నిర్మాత దర్శకులు వి.వి. వామన్ రావు, సునీల్ కుమార్ రెడ్డి. నటీనటులు పాత్రోచితంగా అందాలు ఆరబోశారు. అభినయాన్ని అలవోకగా పండించారు. ఈ చిత్రాన్ని భరద్వాజ క్రియేషన్స్ సమర్పించింది.
టాగ్ లైన్ : మారిన కాలం - సరైన చిత్రం
రేటింగ్ : 3 స్టార్స్
విశ్లేషణ: పి.వి. రామ మోహన్ నాయుడు