విజయవాడ
బెజవాడ లో దారుణం జరిగింది. మస్కట్ లో వుంటున్న ఉషారాణి ఊరి వేసుకుని మృతి చెందింది. ఆమె కుటుంబసభ్యులు మాత్రం అల్లుడు హత్య చేసి.. ఆత్మహత్య గా చిత్రికరిస్తున్నారని అరోపిస్తున్ఆరు. శుక్రవారం రాత్రి ఉషారాణి మృతదేహాన్ని మస్కట్ నుండి విజయవాడకు తెచ్చారు. మృతిరాలి అత్తింటివారు మృతదేహం ను చూపించేందుకు నిరాకరిస్తున్నారు. నిన్నటి నుండి మృతదేహం చూసేందుకు విజయవాడ ఆటోనగర్ లోని అత్తింటివారి వద్ద మృతిరాలి తల్లిదండ్రులు, బందువులు వేచిచూసారు. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన ఉషారాణికు , విజయవాడకు చెందిన యల్ల భాస్కర్ కు ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఇంకా పిల్లలు లేక పోవడం తో చిత్రహింసలు పెట్టి తమ కుమార్తె ను హత్య చేశారని ఉషారాణి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు..