YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అమ్మ పెట్టదు..అడుక్కోనివ్వదు రాష్ట్రాలను శిక్షించేలా కేంద్రం చర్యలు 15వ ఆర్థిక సంఘం విధానాలను తూర్పారపట్టిన చంద్రబాబునాయుడు

అమ్మ పెట్టదు..అడుక్కోనివ్వదు     రాష్ట్రాలను శిక్షించేలా కేంద్రం చర్యలు 15వ ఆర్థిక సంఘం విధానాలను తూర్పారపట్టిన చంద్రబాబునాయుడు

అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రాలను శిక్షించేలా కేంద్రం చర్యలు ఉండకూడదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పదిహేనో ఆర్థిక సంఘం టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్సును వ్యతిరేకిస్తూ అమరావతి సచివాలయం వేదికగా జరుగుతున్న 11 రాష్ట్రాల ఆర్థికమంత్రుల సమావేశంలో చంద్రబాబు కీలకోపన్యాసం చేశారు. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలు ఇప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా కేంద్ర నిధుల కేటాయింపు జరపడం సరికాదని స్పష్టంచేశారు.కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని గౌరవించాలని.. కష్టపడుతున్న వారినే శిక్షించేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విషయంలోనూ అదే జరుగుతోందని అన్నారు.కేంద్రం నిధులూ ఇవ్వకపోవడం. రాష్ట్రాలు అప్పులు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించకపోవడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుపట్టారు.15వ ఆర్ధిక సంఘం విధి విధానాలను మార్చాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతిని కలుద్దామని ఆయన వివిధ రాష్ట్రాలకు పిలుపునిచ్చారు.

జనాభా నియంత్రణలో కేరళ అందరికన్నా ముందుందని.. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ జనాభా నియంత్రణకు ప్రాధాన్యత ఇచ్చామని గుర్తుచేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం నిధుల కేటాయింపు చేస్తామంటే పురోగమనంలో వున్న రాష్ట్రాలు నష్టపోతాయని స్పష్టం చేశారు. అంతిమంగా పేదరిక నిర్మూలనే తమ ధ్యేయమని, ఇందుకు అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.పదిహేనవ ఆర్ధిక సంఘం విధివిధానాల ప్రకారం రాష్ట్రాలు ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని కోల్పోతున్నాయని ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. కేవలం యుద్ధ సమయంలో మాత్రమే ఇలాంటి విధానాన్ని అమలు చేయాల్సి ఉండగా కేంద్రం ఇందుకు విరుద్ధంగా సాధారణ పరిస్థితుల్లోనూ సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని అసంతృప్తి వ్యక్తంచేశారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ఉండాలో సర్కారియా కమిషన్ స్పష్టంగా పేర్కొందనియనమలఅన్నారు.ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయడానికి చంద్రబాబు కృషి చేస్తున్నారనిపశ్చిమబంగా ఆర్ధిక మంత్రి అమిత్ మిత్ర అన్నారు. గ్రీన్ ఫీల్డ్ రాజధానిఏర్పాటు చేయడాన్ని చంద్రబాబు ఛాలెంజ్‌గా తీసుకున్నారని.. ఐటీ రంగంలో చంద్రబాబు ఎటువంటి కృషిచేశారో అందరికీ తెలుసునన్నారు.సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.15వ ఆర్ధిక సంఘం ద్వారానే కాదు.. వివిధ రూపాల్లో సమాఖ్యస్ఫూర్తిని దెబ్బ తీసేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. ప్రజాకర్షక పథకాలకునిధుల కోత పెట్టేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. 15వ ఆర్ధిక సంఘం విధివిధానాల విషయంలో కేంద్రం వ్యవహరిస్తోన్న తీరును ప్రజల్లోకితీసుకెళ్లడంతో పాటు.. రాష్ట్రపతి దగ్గరకు వెళ్లాల్సి ఉందని అమిత్‌ మిత్రఅన్నారు.

పంజాబ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి కేవలం 29 శాతం నిధులు మాత్రమేవస్తున్నాయని.. కొన్ని రాష్ట్రాలకు కేంద్రం వాటా ఎక్కువగా వెళ్తోందని పంజాబ్‌ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్‌సింగ్‌ తెలిపారు. సమాఖ్య స్ఫూర్తిగా విరుద్దంగా కేంద్రంవ్యవహరిస్తోందన్నారు.కేరళలో నిర్వహించిన తొలి సమావేశానికి నాలుగు రాష్ట్రాలు మద్దతేలభించిందని.. ఈ సమావేశానికి మద్దతిచ్చే రాష్ట్రాలసంఖ్య పెరిగిందని కేరళమంత్రి థామస్ ఐసాక్ అన్నారు. 15వ ఆర్ధిక సంఘం విధి విధానాలనువ్యతిరేకించే రాష్ట్రాల సంఖ్య భవిష్యత్తులో పదికి పెరుగుతుందనిభావిస్తున్నట్లు తెలిపారు. ఎఫ్ఆర్బీఎంను 1.7 శాతానికి కుదించే ఆలోచనలోకేంద్రం ఉందన్నారు. రెవెన్యూ డివల్యూషరన్‌ను 2011 జనాభా లెక్కలప్రకారం చేస్తామంటే కొన్నరాష్ట్రాలకుఇబ్బందేనని థామస్‌ ఐసాక్‌ అన్నారు.15వ ఆర్ధిక సంఘం విధి విధానాలు మార్చాల్సిందేనని పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి అన్నారు. దీనివల్లరాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఇబ్బందులు కలిగించేలా విధివిధానాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఎక్సైజ్, కమర్షియల్ టాక్సులేపుదుచ్చేరికి ప్రధాన ఆదాయమని.. కానీ వీటిని భర్తీ చేయడానికి కేంద్రంఅంగీకరించడం లేదన్నారు.చిన్న రాష్ట్రాలకు..కేంద్రలిత ప్రాంతాలకు 15వ ఆర్ధిక సంఘం విధివిధానాలుఇబ్బందికరంగాఉన్నాయని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. కేరళలో జరిగినఆర్ధిక మంత్రుల సదస్సులోతీసుకున్న నిర్ణయాలకు తమ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు.

Related Posts