YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

ఇంటర్ వరకు 36 కేవీజీబీలు

ఇంటర్ వరకు 36 కేవీజీబీలు

హైదరాబాద్, సెప్టెంబర్ 18, 
తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 36 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను ఇంటర్మీడియట్ స్థాయికి పెంచుతున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. దీంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కస్తూర్బా ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు వారి జీవితాల్లో మరిన్ని వెలుగులు నింపబోతున్నాయని అన్నారు. ఈ విద్యా సంవత్సరం (2021-22) నుంచే కేజీబీవీల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో ఎంపిసి, బైపిసి, సిఈసి, ఎంపిహెచ్ డబ్ల్యూ గ్రూపులను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.ఒక్కో గ్రూపులో 40 చొప్పున సీట్లను కేటాయిస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో 475 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఇప్పటికే 172 విద్యాలయాలలో ఇంటర్మీడియట్ విద్య అందిస్తున్నామన్నారు. స్థానికంగా ఉన్న పేద విద్యార్థినులు ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ చదువుకునే అవకాశం కల్పిస్తుందన్నారు.
ఈ విద్యాలయాల్లో చేరిన బాలికలకు అన్ని ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.ఇందులో చేరిన ప్రతి బాలికకు పౌష్టిక అహారంతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. నైపుణ్యాల అభివృద్ధిలో భాగంగా చదువుతో పాటు నాయకత్వ లక్షణాలు, కరాటే, యోగా, ధ్యానం తదితర అంశాల్లో శిక్షణ కూడా ఇస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బాలికలు జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాక్షించారు. ప్రైవేట్‌ స్కూల్స్‌కి ధీటుగా ఇందులో విద్య ఉంటుందన్నారు.విద్యాపరంగా వెనకబడిన మండలాలలో బాలికల విద్యాభివృద్ధి కోసం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఏర్పాటు చేశారు. బడుగు, బలహీన వర్గాల బాలికలకు నాణ్యమైన విద్యను అందించడమే కెజిబివిల లక్ష్యం. ఈ లక్ష్యసాధన కోసం భోజన సౌకర్యాలను కల్పిస్తూ, ఎలిమెంటరీ స్ధాయి వరకు విద్య నేర్పడానికి వసతి పాఠశాలలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇవి ఇంటర్మీడియెట్ వరకు విస్తరించడం విశేషం.

Related Posts