YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రేవంత్ కి చిక్కులు

రేవంత్ కి చిక్కులు

హైదరాబాద్, సెప్టెంబర్ 18, 
పాలిటిక్స్ అన్నాక సంయమనం అవసరం. ఒక ముఖ్యమైన పదవి లో ఉంటే పెదవి దాటి పెడసరి మాటలు రాకూడదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పెడసరితనంతోనే చిక్కులు ఎదుర్కొంటున్నారు. అతి తక్కువ సమయంలోనే జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కావడం అంటే మాటలు కాదు. గతంలో ఎంతోమంది నేతలు ఏళ్లుగా కష్టపడ్డా ఫలితం దక్కలేదు. కానీ రేవంత్ రెడ్డి విషయంలో అదృష్టం తలుపుతట్టినట్లయింది. ఆయనను అధిష్టానం నమ్మింది. ఎక్కువ సంఖ్యలో వ్యతిరేకిస్తున్నా లెక్క చేయకుండా కీలకమైన పదవిని రేవంత్ రెడ్డికి అప్పగించింది.ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఏం చేయాలి. తాను మాటకారి కావచ్చు. కానీ కాంగ్రెస్ లో జూనియర్ అన్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలి. పార్టీ అధినాయకత్వానికి దగ్గరగా ఉండే వారినే తూలనాడితే ఎలా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. శశిధరూర్ వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. నిజానికి ఒక మీడియా సంస్థ ప్రతినిధి ఎదుట రేవంత్ రెడ్డి పిచ్చాపాటీగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. సొంత పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ ను గాడిద అని సంభోదించారు.ఇంతకీ శశిధరూర్ ను అంత మాట రేవంత్ రెడ్డి ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఆయన ఐటీ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ హోదాలో తెలంగాణ ప్రభుత్వ పనితీరును ప్రశంసించడమే. ఈ ప్రశంసలకు రేవంత్ రెడ్డికి మంటెక్కింది. అవతల నేత ఎవరనేది చూసుకోలేదు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఇప్పుడు అది వివాదం కావడంతో ఆయన శశిథరూర్ కు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.కాంగ్రెస్ టీడీపీ లాంటి ప్రాంతీయ పార్టీ కాదు. రాష్ట్రంలో నువ్వు ఎంత తోపు అయినా ఢిల్లీ నేతల ముందు తలవొంచాల్సిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంతటి వాడినే ఢిల్లీ నేతలు ముప్పు తిప్పలు పెట్టారన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవడం మంచింది. రేవంత్ రెడ్డి తనకు పార్టీ అధినాయకత్వం ఇచ్చిన అవకాశాన్ని చేజేతులా తానే నాశనం చేసుకుంటున్నారా? అన్న అనుమానం కలుగుతోంది. అసలే సొంత పార్టీలోనే రేవంత్ కు శత్రువులు ఎక్కువ. ఇలా ఆయన దూకుడు వైఖరి రాజకీయంగా భవిష్యత్ లోనూ ఇబ్బంది తెచ్చిపెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related Posts