మీ హృదయాలను భగవంతునికి నివాసంగా మార్చుకోండి. దేవుని యందు ప్రేమచేత మీ హృదయ పవిత్రతను కాపాడుకొండి. తద్వారా దైవము మీతో ఉంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు ఎక్కడ ఉన్నా ఎల్లప్పుడూ దైవమును గుర్తుపెట్టుకోండి. ఇతరులకు సహాయం చేయడానికి అవకాశాలను వెతకండి. దుఃఖము, బాధల నుండి ఉపశమనం కోసం మీలోని ఆధ్యాత్మిక నైపుణ్యాలను ఉపయోగించండి. మీ సహజ సంపదైన ఆధ్యాత్మిక అభ్యాసాన్ని వదిలివేయడం గానీ, నిర్లక్ష్యం చేయడం గానీ లేదా వాయిదా వేయడం గానీ చేయవద్దు. అన్నింటికీ మించి భగవంతుడు అన్ని సమయాలలో అంతటా మీతో ఉన్నాడనే నమ్మకాన్ని కలిగి ఉండండి. హింసకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. దేవుని ప్రణాళికలను అంగీకరించండి. మీరు అపజయాలుగా, కష్టములుగా, నష్టములుగా భావిస్తున్నవి మున్ముందు మిమ్మిల్ని మరింత విజయవంతముగా, సౌకర్యవంతంగా మలచి మిమ్మల్ని ఆనంద సాగరంలో మునకలు వేయిస్తాడు. విశ్వాసముతో, సహనంతో ఉండండి"