YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

భగీరథ పనులు వేగవంతం : కడియం శ్రీహరి

 భగీరథ పనులు వేగవంతం : కడియం శ్రీహరి

మహబూబాబాద్ జిల్లాలో సోమవారం  డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ పర్యటించారు. దంతాలపల్లి మండలం బొడ్ల డలో  ఉదయం ఉపాధి హామీ కూలీలతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడారు.  ఈ ఊరిలో ఉన్న మిషన్ భగీరథ సంపూ హౌస్ లను పరిశీలించారు.  కేసముద్రం లో మిషన్ భగీరథ పనులను పరిశీలించారు.  మహబూబాబాద్ లోని మిషన్ భగీరథ పనులను పరిశీలించి 15 రోజుల్లో పనులను పూర్తి చేసి ప్రజలకి తాగు నీరు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ లోని యశోద  గార్డెన్ లో జరిగిన రైతు సమన్వయ సమితి సభ్యులకు  రైతు బంధు చెక్కులు, పాసు పుస్తకాలు ఈ నెల 10 నుండి ఎలా పంపిణీ చేయాలి అనే అంశం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు చెప్పిన అన్ని అంశాలను పథకాల రూపంలో అమలు చేస్తూ వ్యవసాయం దండగ అనకుండా పండుగ చేస్తున్నారని అన్నారు. పర్యాటక మంత్రి చందూలాల్ మాట్లాడుతూ దేశంలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది అని దాన్ని మనం ఉపయోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్యా నాయక్, కలెక్టర్ శివలింగయ్య, రైతు సమితి జిల్లా కోఆర్డినేటర్ బాలాజీ, 16 మండలాల రెవెన్యూశాఖ అధికారులు, గ్రామ సమితి సభ్యులు పాల్గొన్నారు

Related Posts