YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కేబినెట్ విస్తరణకు ముహుర్తం

కేబినెట్ విస్తరణకు ముహుర్తం

కేబినెట్ విస్తరణకు ముహుర్తం
విజయవాడ, సెప్టెంబర్ 18,
ఏపీ మంత్రివ‌ర్గంలో ఎప్పుడైనా మార్పులు జరిగే అవ‌కాశం ఉందా? అందుకు జ‌గ‌న్ సంకేతాలు ఇచ్చారా? అనే చ‌ర్చ అధికార పార్టీలో ప్రారంభ‌మైంది. ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లోనే మంత్రివ‌ర్గంలో ప్రస్తుతం ఉన్న వారు రెండున్నరేళ్ల మాత్రమే ఉంటారని, త‌రువాత కొత్తవారికి అవ‌కాశం ఉంటుందని ప్రక‌టించారు సీఎం జగన్. వైసీపీ అధికారంలోకి వ‌చ్చి జ‌న‌వ‌రి నాటికి రెండున్నరేళ్లు కావ‌స్తుంది. దీంతో త్వర‌లోనే కేబినెట్‌లో ఉన్నవారికి ఉద్వాస‌న ప‌లుకుతార‌న్న చ‌ర్చ జ‌రుగుతుంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవ‌రుంటారు.. ఎవ‌రు ఉండ‌రో అని లెక్కలు వేస్తున్నట్లు స‌మాచారం. ప‌నితీరు ఆధారంగానే మార్పులు చేర్పులు ఉంటాయ‌న్న చ‌ర్చ జ‌రుగుతుంది. మంత్రివ‌ర్గ విస్తర‌ణ ఉంటుందా.. పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తారా, లేదా  అని పార్టీలో చర్చించుకుంటున్నారు.వ‌చ్చే సార్వత్రిక ఎన్నిక‌ల కోసం ఇప్పటి నుండే జ‌గ‌న్ క‌స‌ర‌త్తు ప్రారంభించారు. 2019 వంటి ఫ‌లితాలే సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు వైసీపీ అధినేత. అందుకే త్వర‌లో జ‌ర‌గ‌బోయే మంత్రివ‌ర్గ మార్పులు 2024 ఎన్నిక‌ల టీమ్‌గానే ఉండ‌నుంద‌ని చ‌ర్చ జ‌రుగుతుంది. ఇదే క్రమంలో ప్రస్తుతం మంత్రివ‌ర్గంలో ఉండి, తొల‌గించిన వారికి ఎన్నిక‌ల భాద్యత‌ను అప్పగించ‌నున్నారు జగన్. ఇదే విష‌యాన్ని ప్రక‌టించారు మంత్రి పేర్నినాని. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో 20 శాతం కొన‌సాగుతార‌ని, 80 శాతం మందిని త‌ప్పించి పార్టీ భాద్యత‌లు అప్పగిస్తార‌న్న సంకేతాలు ఇచ్చారు పేర్ని నాని. దీంతో మంత్రివ‌ర్గ విస్తర‌ణా? లేక పూర్తిస్థాయిలో ప్రక్షాళ‌న అన్నదానిపై త్వర‌లో క్లారిటీ రానుంది. వ‌చ్చే సంవ‌త్సరం సంక్రాంతి నాటికి కేబినెట్‌లో మార్పులు చేర్పులు ఉంట‌డం మాత్రం ఖాయంగా కనిపిస్తోందని వైసీపీలో చర్చించుకుంటున్నారు
బుగ్గన వర్సెస్ యనమల
రాష్ట్రమంతా ఒక వ్యవహారంపై మాటల తూటాలు పేలుతుంటే .. ఆ ఇద్దరి నేతల మధ్య మాత్రం మరో పంచాయతీ జరుగుతోంది. టీడీపీ సీనియర్ నేత యనమల, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన మధ్య లేఖల యుద్ధం, మాటల యుద్ధం సమాంతరంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో అప్పులు, వాటి లెక్కలు. ఈ పాయింట్‌పైనే ఇప్పుడు వీరి మధ్య వార్ జరుగుతోంది. మాజీ ఆర్థిక మంత్రి యనమల విడుదల చేసిన లెక్కలకు కౌంటర్‌ గణాంకాలు విడుదల చేశారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌. కరోనా సంవత్సరాన్ని కలిపి లెక్కలు గట్టి ఆర్థిక వృద్ధి కాలేదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కరోనాకు ముందు ఏడాది 2019-20లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 7.23 శాతం వృద్ధి ఉన్నట్లు కొత్త చిట్టా విడుదల చేశారు. వ్యవసాయ రంగంలో 7.91 శాతం ; పారిశ్రామిక రంగంలో 10.24 శాతం వృద్ధి నమోదైందని చెప్పారు. 2020 – 21 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఇండెక్సులో ఏపీకి 3వ ర్యాంకు వచ్చినట్లు గుర్తు చేశారు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం పేదరిక నిర్ములన, అసమానతల తగ్గింపులో 5, 6 స్థానాల్లో నిలిచామన్నారు. తప్పుడు లెక్కలతో యనమల ప్రజలను బురిడీ కొట్టించలేరంటూ ఘాటుగా స్పందించారు.బాధ్యత లేని ప్రతిపక్షంగా టీడీపీ వ్యవహరిస్తోందన్నారు. మాజీ ఆర్థికమంత్రిగా ఉండి ప్రజలను తప్పుదోవ పట్టించడం దుర్మార్గమన్నారు. గత టీడీపీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి రాష్ట్ర GSDP కూడా క్షీణిస్తూ వచ్చిందన్నారు బుగ్గన. టీడీపీ చూపించిన నిరుద్యోగ రేటుపైనా ఆయన మండిపడ్డారు. యనమల పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఏ లెక్కల ప్రకారం నిరుద్యోగ రేటు 6.5శాతమో చెప్పాలన్నారు. 2018-19లో 5.7శాతమున్న నిరుద్యోగ రేటు.. 2019-20 కల్లా 5.1శాతానికి దిగొచ్చిందన్నారు
 

Related Posts