YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్

మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్

మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ సమక్షంలో అంగరంగ వైభవంగా  "లవ్ స్టోరి" అన్ ప్లగ్డ్ ఈవెంట్
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా "లవ్ స్టోరి". ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల కాలంలో చూస్తే థియేటర్ లలో రిలీజ్ అవుతున్న ప్రతిష్టాత్మక సినిమా "లవ్ స్టోరి" అనుకోవచ్చు.  రేవంత్, మౌనికల ప్రేమ కథను తెరపై చూసేందుకు ఆడియెన్స్ వెయిటింగ్ గుస్తోంది. సెప్టెంబర్ 24న "లవ్ స్టోరి" థియేటర్ భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ అవుతోంది. చిత్ర ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తాజాగా "లవ్ స్టోరి" అన్ ప్లగ్ డ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని ఓ హోటళ్లో గ్రాండ్ గా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ అతిథులుగా హాజరయ్యారు. చిరు, అమీర్ ఖాన్ "లవ్ స్టోరి" టీమ్ కు బెస్ట్ విశెస్ తెలిపారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ మాట్లాడుతూ...మా సినిమా కార్యక్రమానికి అమీర్ ఖాన్ గారు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. "లవ్ స్టోరి" పాటలు ఇంత పెద్ద విజయం సాధించాయంటే అందుకు కారణం దర్శకుడు శేఖర్ కమ్ముల గారు. నాపై నమ్మకం ఉంచినందుకు ఆయనకు థాంక్స్. కేవలం సంగీతమే కాదు శేఖర్ గారితో జర్నీ చేసిన ఈ రెండేళ్లలో మంచి మనిషిగా కూడా మారాను. ఇదొక మెమొరబుల్ జర్నీ నాకు. మా సినిమాకు మంచి సాంగ్స్ రాసిన లిరిసిస్ట్స్ అందరికీ థాంక్స్. అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ... కరోనా లాక్ డౌన్ తర్వాత పిల్లలు స్కూల్ కు వెళ్తే ఎంత సంతోషంగా ఉంటుందో, ఇప్పుడు ఇలా సినిమా ఫంక్షన్స్ కు రావడం అంతే సంతోషంగా ఉంది. సినిమా కార్యక్రమాల్లో మిత్రులను కలిసి, ప్రేక్షకుల చప్పట్లు విని చాలా రోజులు అవుతోంది. ఈ మధ్య నన్ను ఎవరైనా టీజర్, ట్రైలర్ లాంఛ్ చేయమని అడిగితే, ఇంట్లో కూర్చుని లాప్ టాప్ లో చేస్తూ ఉన్నాను. కానీ బయటకొచ్చి ఆడియెన్స్ చప్పట్లు వింటే వచ్చే సంతోషం వేరు. నారాయణదాస్ నారంగ్ గారు నాకు ఎన్నో ఏళ్లుగా మిత్రులు. ఆయన 80 వ దశకంలో డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగంలోకి లోకి చ్చినప్పటి నుంచి నాకు సన్నిహిత సంబంధం ఉంది. ఆయన నాకు గురువులా భావిస్తాను. ఫిల్మ్ ఇండస్ట్రీకి భీష్మాచార్యులు వంటివారు. ఏషియన్ ఫిల్మ్స్ నిర్మాణ రంగంలోకి రావడం సంతోషకరం. మీలాంటి వాళ్లు ప్రొడక్షన్ లోకి రావాలి. సినిమాలు నిర్మించాలి. సినిమా విలువ మరింత పెంచాలి. మీకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. నారాయణదాస్ గారి అబ్బాయి సునీల్ తండ్రిని మించిన తనయుడు. చాలా స్మార్ట్. వాళ్ల కృషి లేకుంటే పంపిణీ రంగంలో, ఎగ్జిబిషన్ సెక్టార్ లో ఇన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్, ఇన్ని స్క్రీన్స్ అందుబాటులో ఉండేవి కావు. ఇవాళ భారతదేశంలోనే ఎక్కువగా మల్టీప్లెక్స్ థియేటర్స్ హైదరాబాద్ లో ఉన్నాయంటే కారణం సునీల్ నారంగ్ లాంటి వాళ్ల కృషి వల్లే. "లవ్ స్టోరి" టైటిల్ విన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ప్రేమ కథలు చూసి చాలా కాలం అవుతోంది. నా స్నేహితుడు నాగార్జున గారి అబ్బాయి నటించాడు. ఇందాక
అమీర్ ఖాన్ నాతో నాగ చైతన్య గురించి చెప్పారు. లాల్ సింగ్ చద్దాలో నటించాడు. చాలా కంఫర్ట్ గా అనిపించింది, మంచి యాక్టర్ అని. ఆ మాట వింటే నాకూ సంతోషమేసింది. నాగ చైతన్య మంచి వ్యక్తి. సక్సెస్, ఫెయిల్యూర్స్ కు చాలా మంది ఎగిరిపడుతుంటారు. కానీ చైతూ ఎప్పుడూ ఒకేలా సంమయనంతో ఉంటాడు. నాగార్జున లాంటి కూల్ ఫాదర్ కు చైతూ లాంటి కూల్ సన్ ఉన్నాడు. ఇండస్ట్రీతో నాగ చైతన్య జర్నీ కూడా నిర్మాణాత్మకంగా సాగుతోంది. ఆయన సుదీర్ఘ కాలం ప్రయాణం చేసేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పగలను. చైతూ మంచి కథలు ఎంచుకుంటాడు, సెలెక్టివ్ గా, కొత్తగా సినిమాలు చేస్తుంటాడు. "లవ్ స్టోరి" కూడా అలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ చైతూ. నాగ చైతన్య, నా మిత్రుడు అమీర్ ఖాన్ కలిసి నటించిన సినిమా లాల్ సింగ్ చద్దా చూడాలని వేచి చూస్తున్నాను. నేనే ముంబై వచ్చి సినిమా చూస్తానని అమీర్ తో చెప్పాను. ఆయన లేదు నేనే వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో మీకోసం ప్రొజక్షన్ వేయిస్తా అన్నారు. సో నైస్ ఆఫ్ హిమ్. టోక్యో ఎయిర్ పోర్ట్ లో అమీర్ ను కలిసినప్పుడు తనకు సినిమా మీదున్న ప్యాషన్ గురించి చెప్పాడు. ఫారెస్ట్ గంప్ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడో తెలిపాడు. సినిమా మీద అమీర్ ఖాన్ కు ఉన్న ప్రేమ చూసి నాకు ఆశ్చర్యం వేసింది. మేమంతా లాల్ సింగ్ చద్దా చూసేందుకు వేచి ఉన్నాం. ఆయన హైదరాబాద్ వచ్చి, యంగ్ స్టార్స్ ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థాంక్స్. సాయి పల్లవిని ఫిదా సినిమాలో చూసే దాకా ఆమె ఎవరో తెలియదు. ఫిదాలో సాయి పల్లవి టైమింగ్, డాన్స్ టాలెంట్, ఎనర్జీ చూసి ఎవరీ అమ్మాయి అని ఆశ్చర్యపోయాను. వరుణ్ వచ్చి ఎలా చేశాను డాడీ అని అడిగితే, సారీరా నేను నిన్ను చూడలేదు, సాయి పల్లవిని చూశాను అని చెప్పాను. నా సినిమా ఆచార్యలో సాయి పల్లవి సోదరి క్యారెక్టర్ చేయాల్సింది. కానీ ఆమె నో చెప్పింది, నాక్కూడా సాయి పల్లవితో బ్రదర్ క్యారెక్టర్ లో నటించాలని లేదు. ఆమె లాంటి వండర్ ఫుల్ డాన్సర్ తో హీరోగా డాన్సులు చేయాలని ఉంది. నాతో అప్పట్లో రాధ, శ్రీదేవి పోటాపోటీగా డాన్సులు చేసేవారు. వాళ్లతో డాన్స్ చేస్తుంటే ఛాలెజింగ్ గా ఉండేది. చైతూ కూడా సాయి పల్లవితో డాన్స్ చేసేప్పుడు ఇబ్బంది పడే ఉంటాడు. మీ ఇద్దరి కాంబినేషన్ విజువల్ ఫీస్ట్ గా ఉండాలని కోరుకుంటున్నా. కొన్నేళ్ల కిందట శేఖర్ కమ్ముల కలిశాడు. మీ సినిమాలు చూస్తూ పెరిగాను, మీరంటే ఇష్టం అని చెప్పాడు. అతను వస్తే ముందు నవ్వు కనిపిస్తుంది. అంత పాజిటివ్ పర్సన్. శేఖర్ కమ్ముల ఎవరి దగ్గరా పనిచేయలేదు. కానీ ఆయనకంటూ ఒక స్టైల్ ఏర్పర్చుకున్నాడు. ఇవాళ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో నిలబడ్డాడు. కమర్షియల్ యాంగిల్ కోసం తాపత్రయపడడు. తను అనుకున్న కథను ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా తెరకెక్కిస్తాడు. శేఖర్ కమ్ముల సినిమాను నేనెంతో అభిమానిస్తాను. ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని ఖచ్చితంగా చెప్పగలను. పవన్ మ్యూజిక్ అదిరిపోయింది. సారంగ దరియా సాంగ్ కోసమైనా "లవ్ స్టోరి" సినిమా రెండు మూడు సార్లు చూస్తాను. మొన్న కరోనా టైమ్ లో ఇండస్ట్రీలో కార్మికులు పనిలేక అల్లాడిపోయారు. వాళ్లకు మేమంతా కలిసి నిత్యావసర వస్తువులు అందించి, ఆదుకున్నాం. ఇదే కాదు ఏ విపత్తు వచ్చినా ముందుగా స్పందించేది సినిమా తారలు అని చెప్పేందుకు గర్వపడుతున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా పరిశ్రమను ఆదుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు రావాలని వినమ్రంగా కోరుతున్నా. అన్నారు. 
అమీర్ ఖాన్ మాట్లాడుతూ...నాగ చైతన్యను లాల్ సింగ్ చద్దా కోసం ఫస్ట్ టైమ్ కలిశాను. ఆయనతో పనిచేస్తుంటే, ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించాడు. లవ్ స్టోరి సినిమా కార్యక్రమం కోసం ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. నేనూ మీలాగే లవ్ స్టోరి చిత్రాన్ని ఈ నెల 24న చూస్తాను. అదీ థియేటర్ లలోనే. మహారాష్ట్రలో థియేటర్స్ ఇంకా ఓపెన్ అవలేదు. కానీ ప్రత్యేకంగా స్క్రీనింగ్ వేసుకుని చూడాలని అనుకుంటున్నాను. మొత్తం టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. శేఖర్ కమ్ముల మీద ఇక్కడికి వచ్చిన అతిథులు చూపిస్తున్న ప్రేమ నన్ను కదిలిస్తోంది. సాయి పల్లవి పాటలు కొన్ని యూట్యూబ్ లో చూశాను. కానీ ఆమె సినిమాలు నేను ఇంకా చూడలేదు. ఆమె సినిమా పాటలోని ఫస్ట్ క్లిప్ చూసినప్పుడు సాయి పల్లవికి ఫ్యాన్ అయ్యాను. లవ్ స్టోరి సినిమా సంగీత దర్శకుడు, ఎడిటర్, డీవోపీ అండ్ ఆల్ కాస్ట్ అండ్ క్రూకు ఆల్ ద బెస్ట్. అన్నారు.

Related Posts