YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మూటముల్లే సర్దేదద్దామా

మూటముల్లే సర్దేదద్దామా

హైదరాబాద్, సెప్టెంబర్ 20, 
తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీకి ఎన్నికలకు ముందే నూకలు చెల్లాయని చెప్పొచ్చు. ఈ పార్టీని ఆదరించే అవకాశాలు చాలా తక్కువగా కన్పిస్తున్నాయి. ఎటు చూసినా వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ప్రభావం చూపే ఛాన్స్ లేదు. అయితే వైఎస్ షర్మిల మాత్రం ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఓటు బ్యాంకు తనకు అనుకూలంగా మారుతుందని, తాను నిర్ణయాత్మక శక్తిగా మారతానని అంచనా వేస్తున్నారు.వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని పెట్టి నెలలు గడుస్తుంది. ఇప్పటి వరకూ ఈ పార్టీలో చేరే వారి సంఖ్య పెద్దగా లేదు. వైఎస్ షర్మిల నిరుద్యోగ సమస్యపై పోరాడుతున్నారు. యువతను ఆకర్షించేందుకు ఈ ఎత్తుగడను ఎంచుకున్నారు. ప్రతి మంగళవారం ఏదో ఒక చోట దీక్ష చేస్తున్నారు. ఈదీక్షలకు కూడా పెద్దగా రెస్పాన్స్ రాకపోవడం విశేషం. దీంతో షర్మిల డీలా పడినట్లు చెబుతున్నారు.తెలంగాణలో ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. ఈ రెండున్నరేళ్లు పార్టీని వైఎస్ షర్మిల లాగించాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఇందుకు షర్మిల సిద్ధమయినప్పటికీ నేతల విషయంలోనే ఆమెకు సందేహం తలెత్తుతోంది. తన తండ్రి వైఎస్ కు సన్నిహితులు తనకు అండగా నిలుస్తారని వైఎస్ షర్మిల భావించారు. కానీ నెలలు గడుస్తున్నా ఈ వైపు ఎవరూ చూడటం లేదు. కొందరి నేతలను తాను స్వయంగా సంప్రదించినా సున్నితంగా తిరస్కరించినట్లు చెబుతున్నారు.తెలంగాణాలో అధికార టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. బీజేపీ కూడా తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తుంది. మరో వైపు నిన్నటి వరకూ నీరసంగా ఉన్న కాంగ్రెస్ కూడా పుంజుకుంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకుపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్న వైఎస్ షర్మిల కు రేవంత్ రెడ్డి రాకతో అవి కూడా అడుగంటాయి. రేవంత్ ను వ్యతిరేకిస్తున్న నేతలు సయితం వైఎస్ షర్మిల వద్దకు వచ్చేందుకు సిద్ధంగా లేరన్నది వాస్తవం. దీంతో వైఎస్ షర్మిల ఎన్నికలకు ముందే నీరసపడిపోయారని చెప్పకతప్పదు.

Related Posts