YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

పంజాబ్ లో పట్టు తప్పుతోందా

పంజాబ్ లో పట్టు తప్పుతోందా

ఛండీఘడ్, సెప్టెంబర్ 20, 
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. ఒకే.. అమరీందర్ సింగ్ లాంటి నేతలను ఎందరినో కాంగ్రెస్ కోల్పోయింది. ఆ పార్టీ స్వయంకృతాపరాధమే నాయకులను పంపించి వేయడం, ఫలితంగా క్రమంగా రాష్ట్రాల్లో పట్టు కోల్పోవడం కాంగ్రెస్ కు సహజంగా అబ్బిన లక్షణమే. కాంగ్రెస్ పార్టీ ఎంత దీన స్థితిలో ఉన్న తన లక్షణాన్ని కోల్పోలేదు. ఫలితంగా కెప్టెన్ అమరీందర్ వంటి నేతను దూరం చేసుకోవాల్సి వచ్చింది.కెప్టెన్ అమరీందర్ ఆషామాషీ నేత కాదు. 2014 లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీకి ఊహించని స్థానాలను సంపాదించి పెట్టారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించారు. ఆతర్వాత పంజాబ్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ విజయ పరంపర కొనసాగడానికి అమరీందర్ సింగ్ కారణం. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోతున్నా పంజాబ్ లో పార్టీని బతికించింది.. బతికిస్తుంది కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్నది కాదనలేని వాస్తవం.కెప్టెన్ అమరీందర్ సింగ్ గతంలో సైన్యంలో పనిచేవారు. రాజీవ్ గాంధీ తో ఉన్న చనువు కారణంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. తొలి నుంచి ఆయన కాంగ్రెస్ వాదిగానే ఉన్నారు. కాంగ్రెస్ నుంచి అకాలీదళ్ లో చేరినా అది స్వల్పకాలం మాత్రమే. అకాలీదళ్ నుంచి సొంత పార్టీ పెట్టిన అమరీందర్ సింగ్ దెబ్బతిన్నారు. ఆ తర్వాత 1998లో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. 2017లో పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు.పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీకి బలం, బలగం అన్నీ ఆయనే. అయితే సిద్దూకు, అమరీందర్ సింగ్ కు మధ్య ఉన్న విభేదాలు తీవ్రమయ్యాయి. సిద్దూకు హైకమాండ్ ప్రయారిటీ ఇచ్చింది. ఎమ్మెల్యేలు అమరీందర్ పై తిరగబడ్డారు. దీంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినంత మాత్రాన అమరీందర్ సింగ్ వ్యక్తిగతంగా నష్టపోయేదంటూ ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీకే నష్టం. మరికొద్ది నెలల్లో జరగనున్న పంజాబ్ ఎన్నికల్లో అమరీందర్ సింగ్ నాయకత్వం లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఆయన పార్టీకి కూడా రాజీనామా చేసే అవకాశాలు న్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ తన స్వయంకృతాపరాధంతో మరో రాష్ట్రాన్ని కోల్పోయే పరిస్థితిని తెచ్చుకుంది.

Related Posts