YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

ముగిసిన విశాఖ శారదా పీఠాధిపతుల చాతుర్మాస్య దీక్ష రిషికేశ్

ముగిసిన విశాఖ శారదా పీఠాధిపతుల చాతుర్మాస్య దీక్ష రిషికేశ్

ముగిసిన విశాఖ శారదా పీఠాధిపతుల చాతుర్మాస్య దీక్ష
రిషికేశ్
విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు రిషికేశ్ లో చేపట్టిన చాతుర్మాస్య దీక్ష ముగిసింది. సోమవారం ఉదయం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు గంగానదిలో స్నానమాచరించి దీక్షను విరమించారు. అనంతరం లోక కళ్యాణార్ధం భగవద్గీతను పఠించి గోపూజ నిర్వహించారు. ఆ తర్వాత సీమోల్లంఘన సాంప్రదాయాన్ని పాటిస్తూ గ్రామ పొలిమేరలు దాటారు. జూలై 24వ తేదీన వ్యాసపూజతో చాతుర్మాస్య దీక్ష ప్రారంభమైంది. దీక్షా కాలంలో వేదాంత పరమైన అంశాలపై చర్చించారు. నిత్యం వేద విద్యార్థులకు శాస్త్ర సంబంధిత అంశాలు, ఆదిశంకరాచార్యులు రచించిన ప్రస్థాన త్రయ భాష్యంపై పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి పాఠాలు బోధించారు. విశాఖ శ్రీ శారదాపీఠం ప్రచురించదలచిన ఆధ్యాత్మిక గ్రంధాలపై పరిశోధనలు సాగించారు. పీఠాధిపతులు నిత్యం గంగానదికి  హారతులిచ్చారు. అలాగే పీఠం అనుష్టాన దైవం శ్రీ శారదా స్వరూప రాజశ్యామల, చంద్రమౌళీశ్వరులను పీఠార్చన ద్వారా నిత్యం ఆరాధించారు. కరోనా కాలంలోనూ ఆటంకం లేకుండా తపోనిష్టతో దీక్షను ముగించారు.

Related Posts