ఫిబ్రవరిలో రామానుజ విగ్రహ విష్కరణ
హైదరాబాద్, సెప్టెంబర్ 20,
శ్రీశ్రీశ్రీ త్రిదిండి చిన్నజీయర్ స్వామి.. అతిపెద్ద సమాతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహత్కార్కానికి పూనుకున్న నేపథ్యంలో ఇవాళ మీడియా ముందుకొచ్చారు. ఈ బృహత్కార్యానికి సంబంధించిన కార్యక్రమ వివరాల్ని చిన్న జీయర్ వెల్లడించారు. హైదరాబాద్ శంషాబాద్ లోని ముచ్చింతల్ శ్రీరామనగర్‌లో216 అడుగుల సమతా మూర్తి విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరిస్తారు. ఇప్పటికే భగవద్రామానుజుల సహస్రాబ్ది వేడుకల ఆహ్వాన పత్రాలను ప్రముఖులకు అందించారు చిన్నజీయర్ స్వామి.2022 ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు భగవద్రామానుజుల సహస్రాబ్ది వేడుకలు వైభవంగా జరగబోతున్నాయి. 200 ఎకరాల్లో వేయి కోట్లతో భగవద్రామానుజుల 216 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీజేఐ, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వానాలు అందాయి. మహోజ్వల ఘట్టానికి తప్పకుండా హాజరవుతామని చినజీయర్‌స్వామికి కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ ఇప్పటికే హామీ ఇచ్చారు.శ్రీరామ నగరంలో సమత.. మమత.. ఆధ్మాత్మికత .అడుగడుగునా ఉట్టిపడుతుంది. విశ్వమానవాళి శ్రేయస్సును ఆకాంక్షిస్తూ చేపట్టిన ఈ బృహత్క్యార్యం ప్రపంచవ్యాప్తంగా విశిష్టతగా మారింది. భగవద్రామానుల మహా విగ్రహావిష్కరణ సహా 108 దివ్య దేశాలు సంస్కృతి కనులవిందు చేయనుంది. వచ్చే ఫిబ్రవరిలో భగవద్రామానుజుల సహస్రాబ్ధివేడుకలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను చిన్నజీయర్ స్వామి వెల్లడిస్తున్నారు.