YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి కూడా నిరుపేద‌ల జీవితాల కోసమే ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌

నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి కూడా నిరుపేద‌ల జీవితాల కోసమే ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌

నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి కూడా నిరుపేద‌ల జీవితాల కోసమే
ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌
ముంబై సెప్టెంబర్ 20
ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ ఆస్తులపై ఐటీ సోదాలు జ‌రిగిన విష‌యం తెలిసిందే. తాజాగా సోనూసూద్ త‌న‌పై జ‌రిగిన దాడుల‌కు సంబంధించి ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి కూడా నిరుపేద‌ల జీవితాల కోసం పోగు చేసిందే. మీ ప్రేమ వ‌ల‌న అధ్వాన్నంగా ఉన్న‌రోడ్ల వ‌ల‌న ప్ర‌యాణం కూడా సుల‌భం అవుతుంది. మ‌న నిజాయితీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కాలం వెల్ల‌డిస్తుంది. దేశంలోని ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాను. అదే నాకు బలాన్నిస్తుంది. నా జర్నీ ఇలాగే కొనసాగుతుంటుంది.మాన‌వ‌తా కార‌ణాల‌తో కొన్ని బ్రాండ్ల‌ను సైతం ప్రోత్సహించాను. నాలుగు రోజులుగా నేను నా అతిథులు( ఐటీ అధికారులు)తో బిజీగా ఉన్నాను.ముంబయిలోని ఆయన నివాసంతోపాటు.. నాగ్‌పూర్‌, జైపుర్‌లలో ఏకకాలంలో సోదాలు నిర్వ‌హించారు. సోనూ సూద్‌ ఛారిటీ ఫౌండేషన్‌ బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలించారు. దాడులు పూర్తైన త‌ర్వాత ఐటీ అధికారులు సోనూసూద్..  రూ.20 కోట్లకు పైగా ట్యాక్స్ ఎగ్గొట్టాడని వెల్లడించారు. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి కూడా నిరుపేద‌ల జీవితాల కోసం పోగు చేసిందే. మీ ప్రేమ వ‌ల‌న అధ్వాన్నంగా ఉన్న‌రోడ్ల వ‌ల‌న ప్ర‌యాణం కూడా సుల‌భం అవుతుంది. మ‌న నిజాయితీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కాలం వెల్ల‌డిస్తుంది. దేశంలోని ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాను. అదే నాకు బలాన్నిస్తుంది. నా జర్నీ ఇలాగే కొనసాగుతుంటుంది.మాన‌వ‌తా కార‌ణాల‌తో కొన్ని బ్రాండ్ల‌ను సైతం ప్రోత్సహించాను. నాలుగు రోజులుగా నేను నా అతిథులు( ఐటీ అధికారులు)తో బిజీగా ఉన్నాను. ఆ కార‌ణం వ‌ల్ల‌నే మీ సేవ‌లోఉండ‌లేక‌పోయాను. ఇప్పుడు తిరిగి వ‌చ్చాను అంటూ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు సోనూసూద్‌.ఇటీవల సోనూసూద్‌.. దిల్లీ ‘ఆప్‌’ ప్రభుత్వం ప్రారంభించిన ఓ కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. సీఎం కేజ్రీవాల్‌ను కూడా కలిశారు. ఈ నేపథ్యంలో తాజా ఐటీ సోదాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Related Posts