వన్‌టైం సెటిల్‌మెంట్ స్కీం అమలుకు సీఎం జగన్ ఆదేశం
అమరావతి సెప్టెంబర్ 20
గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వన్‌టైం సెటిల్‌మెంట్ స్కీంపై ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందించారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకున్న వారికి వన్‌టైం సెటిల్‌మెంట్ పథకం వర్తిస్తుంది. జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంగా పేరు ఖరారు చేసిన అధికారులు.. పథకం అమలు కోసం రూపొందించిన విధి విధానాలపై సమావేశంలో చర్చించారు. ప్రతిపాదనలను సీఎంకు అధికారులు వివరించారు. సెప్టెంబరు 25 నుంచి డేటాను ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అప్‌లోడ్ చేయనుంది. వివిధ సచివాలయాలకు ఈ డేటాను పంపనున్నారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే వన్‌టైం సెటిల్‌మెంట్ పథకం సొమ్మను చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒన్‌టైం సెటిల్‌మెంట్‌కు అర్హులైన వారి జాబితాలు ఖరారైన తర్వాత నిర్దేశిత రుసుము చెల్లింపుతో వారికి ఇంటిపైన, స్థలాలపైన పూర్తి హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. వన్‌టైం సెటిల్‌మెంట్ స్కీంకు మంచి స్పందన వస్తోందని సీఎంకు అధికారులు తెలిపారు. ఓటీఎస్ పథకం అమలుకు గ్రామ, వార్డు సచివాలయాలు పాయింట్‌గా ఉండాలని సీఎం వైఎస్ జగన్ అన్నారు.