YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కమలంతో ఉద్ధవ్ అడుగులు..?

కమలంతో ఉద్ధవ్ అడుగులు..?

కమలంతో ఉద్ధవ్ అడుగులు..?
ముంబై, సెప్టెంబర్ 21, 
కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న వాళ్లు ఎవరూ సుఖంగా ఉండరు. ఈ విషయం అనేక రాష్ట్రాల్లో స్పష్టమయింది. గతంలో కర్ణాటకలో సంపూర్ణ మెజారిటీ ఉన్నా మిత్రపక్షమైన జేడీఎస్ ను దూరం చేసుకోవడంతో అధికారాన్ని కాంగ్రెస్ కోల్పోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం పాళ్లు ఎక్కువ కావడంతో నేతలు సంకీర్ణ ప్రభుత్వంలో పెత్తనం కోరుకుంటారు. అదే రాజకీయ ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. కర్ణాటక తర్వాత ఇప్పుడు మహారాష్ట్ర లోనూ శివసేన కాంగ్రెస్, ఎన్సీపీలతో ఇబ్బంది పడుతుందంటున్నారు.బీజేపీని కాదని శివసేన కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే రెండేళ్ల కాలంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే స్వయం నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. శరద్ పవార్ ఓకే చెబితేనే ఏ నిర్ణయమైనా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మహారాష్ట్రలో మళ్లీ బీజేపీ, శివసేన ఏకమవుతాయన్న ప్రచారం జరుగుతుంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి అద్దం పడుతున్నాయి.వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి సమీకరణాలు మారతాయంటున్నారు. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే కాంగ్రెస్, ఎన్సీపీ రాజకీయాలతో విసిగిపోయారంటున్నారు. వీరితో ఎక్కువ కాలం నడిస్తే పార్టీ మరింత బలహీనమవుతుందన్నది ఉద్దవ్ థాక్రే అంచనా. పార్టీ క్యాడర్ నుంచి కూడా ఈ మేరకు వత్తిడి వస్తుందంటున్నారు. ఉద్ధవ్ థాక్రే కల నెరవేరింది. ముఖ్యమంత్రి అయ్యారు. లోక్ సభ ఎన్నికల నాటికి ఆయన దాదాపు మూడేళ్ల పాటు ముఖ్యమంత్రి బాధ్యతలను నిర్వహించి నట్లవుతుంది.అందుకే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతోనే వెళ్లాలన్నది ఉద్ధవ్ థాక్రే ఆలోచనగా కన్పిస్తుంది. మరోవైపు సామ్నాలో ప్రధాని నరేంద్ర మోదీని పొగడటం కూడా దీనికి సంకేతాలు అని విశ్లేషకులు సయితం అంగీకరిస్తున్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వకుండా, శివసేన మూల సిద్ధాంతాలకు నీళ్లొదలకుండా ఉండాలంటే బీజేపీీతో పొత్తు అవసరమని ఉద్ధవ్ థాక్రే భావిస్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతానికి ఇది ప్రచారమే అయినా అది కార్యరూపం దాల్చడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు.

Related Posts