YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గురుకులాలు పిలుస్తున్నాయ్.....

గురుకులాలు పిలుస్తున్నాయ్.....

తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యను బలోపేతం చేసే దిశగా పయనిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లల కోసం గురుకులాలను విస్తృత పరుస్తోంది.. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఏ విధమైన సౌకర్యాలు, విద్య లభిస్తుందో అంతకు రెట్టింపుగా వసతులు కల్పిస్తోంది.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్నివర్గాల పిల్లలకు చెందిన 73 పాఠశాలలున్నాయి. నాణ్యమైన భోజనం కొత్తకొత్త భవనాలు, మినరల్ వాటర్, దుస్తులు, ఇతర సౌకర్యాలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.. ఐదవ తరగతి నుంచి డిగ్రీ వరకు ఉచిత విద్యను.. అది కూడా ఇంగ్లిష్ మీడియంలో అందిస్తోంది. ఒకప్పుడు సౌకర్యాల లేమితో అరకొర చదువులు కొనసాగేవి. మెనూలోనూ పెద్దగా మార్పులు ఉండేవి కాదు. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక గురుకుల పాఠశాలల దశ మారిందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సైతం స్పష్టం చేస్తున్నారు. ఆడుకునేందుకు అవసరమైన ఆట వస్తువులు, విశాలమైన క్రీడా మైదానం కేవలం ప్రభుత్వ గురుకుల పాఠశాలలకే సొంతం అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖలకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 73 గురుకు పాఠశాలలున్నాయి. అందులో 23 ఎస్సీ గురుకుల పాఠశాలలు ఉండగా, 13 మైనార్టీ, 25 ఎస్టీ, 12 బీసీ గురుకుల పాఠశాలలున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాంఘిక సంక్షేమ, బీసీ, మైనార్టీ కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 28వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 7వ తేదీలోగా రూ.100 చెల్లించి ఆన్‌లైన్‌లో http://tsswreisjc.cgg.gov.inలో దరఖాస్తు చేయాలి. ఈ నెల 28వ తేదీన నిర్వహించే ప్రవేశ పరీక్షలో పొందే మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఇంటర్‌లో బాలురకు మొత్తం 320 సీట్లు, బాలికలకు 720 సీట్లు ఉన్నాయి. వీటిలో బాలురకు ఎంపీసీలో 160 సీట్లు, బైపీసీలో 160 ఉండగా బాలికలకు ఎంపీసీలో 160, బైపీసీలో 280, ఎంఈసీలో 80, సీఈసీలో 80 సీట్లు ఉన్నాయి.ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ ఖాళీలను భర్తీ చేసేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 15వ తేదీలోగా విద్యార్థులు ఆన్‌లైన్‌లో tsswreisic.cgg.gov.inలో దరఖాస్తు చేయాలి. ఖమ్మం జిల్లాలో 6వ తరగతిలో బాలురకు 12 ఖాళీలు, 8వ తరగతిలో 4 ఖాళీలుండగా, బాలికలకు 6వ తరగతిలో 28, 7లో 15, 8లో 11, 9లో 5 ఖాళీలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బాలురకు 6వ తరగతిలో 23, 7లో 4, 8లో 11, 9లో 4, బాలికలకు 6వ తరగతిలో 24, 7లో 6, 8లో 11, 9లో 1 ఖాళీలున్నాయి. వీటిని రిజర్వేషన్ల ప్రతిపాదికన భర్తీ చేయడం జరుగుతుంది.జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 2018-19 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 28వ తేదీన నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తాం. 6 నుంచి 9వ తరగతుల వరకు ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ ఖాళీలను కూడా భర్తీ చేస్తాం. వాటికి సంబంధించి 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ సీట్లను రిజర్వేషన్ ఆధారంగా భర్తీ చేయనున్నాం. డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 9లోగా దరఖాస్తులు చేసుకోవాలి. ఇంటర్మీడియట్‌లో 40 శాతం మార్కులు వచ్చిన వారు మాత్రమే డిగ్రీ మొదటి సంవత్సరానికి దరఖాస్తు చేసుకోవాలి.ఖమ్మం కొత్తగూడెం జిల్లాలోని బాలికలు, బాలుర డిగ్రీ కళాశాలల్లోని మొదటి సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. బీఏ, బీకాం, బీఎస్సీ, సెమిస్టర్ వారీగా ఇంగ్లిష్ మీడియం కోర్సుల్లో ప్రవేశాలు జరుగనున్నాయి. ఇంటర్మీడియట్‌లో కనీసం 40శాతం మార్కులు పొందిన విద్యార్థులు మాత్రమే అర్హులుగా పేర్కొన్నారు. ఈ నెల 9లోగా దరఖాస్తులను ఆన్‌లైన్‌లో www.tsswreis.telangana.gov.inలో దరఖాస్తు చేయాలి.

Related Posts