YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కామన్ మ్యాన్ లా స్టాలిన్ వాకింగ్

కామన్ మ్యాన్ లా స్టాలిన్ వాకింగ్

కామన్ మ్యాన్ లా స్టాలిన్ వాకింగ్
చెన్నై, సెప్టెంబర్ 21, 
లబ్రెటీలకైనా, సామాన్యులకైనా ఆరోగ్యమే మహాభాగ్యం.. అందుకనే పెద్దలు అందం, ఆస్థి కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇచ్చేవారు. నిత్యం శారీరక శ్రమ చేస్తూ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించేవారు. ఎందుకంటే  ఆరోగ్యంగా లేకపోతే అందం ఆస్థి, హోదా, అధికారం ఇలా ఎన్ని ఉన్నా అవేమీపనికిరావు. అందుకనే సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ ఆరోగ్యంగా ఉండాలని ఫిట్ నెస్ గా ఉండాలని కోరుకుంటారు. ఈ విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా మంచి అవగాహన ఉంది. 68 ఏళ్ల వయసులో కూడా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కండలు కరిగిస్తూ.. చెమటలు చిందిస్తుంటారు.తాజాగా సీఎం స్టాలింగ్  చెన్నైలోని ఆడయార్ పార్క్ లో  మార్నింగ్ వాక్ బాట పట్టారు. ఈ సందర్భంగా పార్కులో వాకింగ్ చేస్తున్న ఇతర వాకర్స్ తో పలు విషయాలపై మాట్లాడారు.  వాకర్స్ ను అడిగి అక్కడ సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళలు సీఎం తో మాట్లాడుతూ.. మీ పాలన బాగుంది అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్న మీరు .. సామాన్య మానవుడిలా ఇలా ప్రజల మధ్యకు రావడం గొప్ప అని.. మీరు  ప్రజల మధ్యలో ఇలా ఉండడం అసాధారణమని కొనియాడారు.

Related Posts