YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 8 లక్షల యాప్ప్ ఔట్

 8 లక్షల యాప్ప్ ఔట్

 8 లక్షల యాప్ప్ ఔట్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22, 
: గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి దాదాపు 8 లక్షల యాప్స్ ఔట్ అయ్యారు. యాప్స్‌ సహకారంతో నిర్వాహకులు సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన గూగుల్, ఆపిల్.. సదరు యాప్స్‌పై నిషేధం విధించాయి. ‘పిక్సలేట్’ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. సైబర్ నేరాలు, నిబంధనల ఉల్లంఘన వంటి కారణాలతో 2021 సంవత్సరం మొదలు నుంచి ఇప్పటి వరకు మొత్తం 8,13,000 లకు పైగా యాప్స్‌పై గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నిషేధం విధించినట్లు.. ‘హెచ్1 2021 డీలిస్టెడ్ మొబైల్ యాప్స్ రిపోర్ట్’ పేరుతో నివేదికను విడుదల చేసింది ‘పిక్సలేట్’. నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా.. పిల్లలే లక్ష్యంగా యాప్స్ క్రియేట్ చేసి.. వాటి ద్వారా సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు పిక్సలేట్ సైబర్ సెక్యూరిటీ సంస్థ తన నివేదికలో పేర్కొంది.కాగా, ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లలో 5 మిలియన్లకు పైగా మొబైల్ యాప్స్‌లను విశ్లేషించిన ఈ కంపెనీ.. కీలక వివరాలు వెల్లడించింది. ఈ యాప్స్ డీలిస్టింగ్ కు సంబంధించి21 మిలియన్ యూజర్లు రివ్యూలు ఇచ్చారని, లక్షలాది మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఈ యాప్స్‌ని వినియోగించే అవకాశం ఉంది పేర్కొంది. యూజర్లు డీలిస్టింగ్ యాప్స్‌ను గుర్తించి.. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అయితే, గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌ నుంచి నిషేధించిన యాప్స్ చాలామంది ఫోన్లలో ఉండే అవకాశం ఉందని, అలాంటి వారు సదరు యాప్స్‌ను డిలీట్ చేయడం ఉత్తమం అని టెక్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మీ మొబైల్‌లో ఉన్న యాప్స్.. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌లో ఉన్నాయో, లేదో చెక్ చేసుకోవాలని, ఒకవేళ సదరు యాప్స్ వాటిల్లో లేకపోతే వెంటనే తొలగించాలని సూచిస్తున్నారు.

Related Posts