YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

 11 రాష్ట్రాల్లో ఈ న్యూ వేరియంట్

 11 రాష్ట్రాల్లో ఈ న్యూ వేరియంట్

 11 రాష్ట్రాల్లో ఈ న్యూ వేరియంట్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22, 
దోమే కదా అని నిర్లక్ష్యం చేశారో అంతే సంగతులు. ఇకపై దోమ కాటుకు గురయ్యారంటే వెంటిలేటర్ వరకు వెళ్లడం ఖాయం. ఎందుకంటే, దోమలు అప్‌డేట్ అయ్యాయ్. మరింత శక్తివంతంగా రూపాంతరం చెందాయి. న్యూపవర్‌తో జనంపై అటాక్ చేస్తున్నాయి. అవును, ఇప్పటివరకు ఒక లెక్క… ఇప్పట్నుంచి మరో లెక్క అన్నట్టుగా దోమలు మరింత పవర్‌ఫుల్‌గా మారాయి. డెంగ్యూ దోమలు కొత్త మ్యూటెంట్‌ను తయారు చేసుకున్నాయి. దాదాపు 11 రాష్ట్రాల్లో ఈ న్యూ వేరియంట్ ఇప్పుడు అల్లకల్లోలం సృష్టిస్తోందిఏపీ, తెలంగాణతోపాటు గుజరాత్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో డెంగ్యూ కొత్త మ్యూటెంట్ బీభత్సం సృష్టిస్తోంది. న్యూ వేరియంట్ దెబ్బకు ప్రతిరోజూ వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.ప్రతి ఏటా సీజనల్ వ్యాధులు, వైరల్ ఫీవర్స్ కామన్. అయితే, ఈ ఏడాది వాటి తీవ్రత అధికంగా ఉందంటున్నారు అధికారులు. దానికి కారణం డెంగ్యూ న్యూ మ్యూటెంట్ అని చెబుతున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న డెంగ్యూ కేసుల సంఖ్యే దీనికి రుజువు అంటున్నారు. ఆగస్ట్ వరకు డెంగ్యూ కేసుల సంఖ్య సాధారణంగా ఉంటే… సెప్టెంబర్‌లో అమాంతం పెరిగిపోయాయని చెబుతున్నారు.ఈ ఏడాది జులై వరకు వివిధ రాష్ట్రాల్లో డెంగ్యూ కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. అయితే, ఇప్పుడు దేశంలో డెంగ్యూ కొత్త మ్యూటెంట్‌ వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. సెరో టైప్-2 డెంగ్యూ వేరియంట్‌పై అలర్ట్‌గా ఉండాలని హెచ్చరించింది.

Related Posts