సెల్ఫీలు దిగుతూ..ప్రాణాంతక విన్యాసం!
సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఓ ట్రెండ్‌గా మారింది
స్పందించని రులు ప్రభుత్వ అధికారులు..
సెల్ఫీలు దిగుతూ సాహసాలు చేయడం, వీడియోలు తీయడం సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఓ ట్రెండ్‌గా మారింది. ప్రాణాంతక విన్యాసాలు ప్రమాదం తెలిసి కూడా యువత ఈ తరహా చర్యలకు పాల్పడి ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు ఎక్కడో ఒకచోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. కశ్మీర్‌కు చెందిన ఓ యువకుడు ప్రమాదమని తెలిసి కూడా వేగంగా రైలు దూసుకొస్తుండగా ట్రాక్ మధ్యలో పడుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది ఎప్పటి వీడియోనో తెలియనప్పటికీ మంగళవారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. కాశ్మీరీ సంప్రదాయ కుర్తా ధరించిన యువకుడు రైల్వే ట్రాక్ మధ్యలో పడుకోవడం, అతని మీదుగా రైలు వెళ్లడం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా అతడి తీరుపై మండిపడుతున్నారు.
ఇలాంటి ప్రాణాంతక విన్యాసాలు ట్రెండ్‌గా మారకముందే చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోపై ట్విట్టర్ వేదికగా స్పందించిన జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.. ప్రాణాంతక విన్యాసం చేసిన యువకుడిది మూర్ఖత్వపు చర్యగా పేర్కొన్నారు. సాహసాల కోసం ఇలాంటి చర్యకు పాల్పడిన యువకుడి మూర్ఖత్వాన్ని నమ్మలేకపోతున్నాను’ ట్వీట్ చేశారు. ఈ వీడియో ట్రెండింగ్‌గా మారి ఎవరూ కూడా అనుకరించక ముందే ఆ వీడియోలో ఉన్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఫేస్‌బుక్ యూజర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోను ఎవరూ కూడా ప్రచారం చేయవద్దంటూ వాట్సాప్ గ్రూపులలో మెసేజ్‌లు షేర్ చేస్తున్నారు. ఈ వీడియోపై ఇప్పటివరకూ ప్రభుత్వ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.