YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

శివప్రసాద్ కుటుంబానికి పదవి

శివప్రసాద్ కుటుంబానికి పదవి

ఒంగోలు, సెప్టెంబర్ 23, 
ఏదైనా అదృష్టం కలసి రావాలి. రాజకీయాల్లోకి వచ్చి లబ్ది పొందిన వారు కొందరైతే. పూర్తిగా నష్టపోయిన వారు మరికొందరు. అలా నష్టపోయిన వారిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఒకరు. ప్రకాశం జల్లాకు చెందిన ఈ యువనేత ఆర్థికంగా నష్టపోయి జగన్ ప్రభంజనంలోనూ గెలుస్తామన్న ధీమా ఉన్నా, డబ్బులు లేక పోటీ చేయలేకపోయారు. ఇప్పుడు జడ్పీ ఛైర్మన్ గా ఆయన తల్లి వెంకాయమ్మ పేరును జగన్ ఖారారు చేశారు.బూచేపల్లి శివప్రసాద్ తండ్రి సుబ్బారెడ్డికి దర్శి నియోజకవర్గంలో మంచి పేరుంది. ఆయన 2004లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి వైఎస్ కు సన్నిహితుడిగా మారారు. 2009 ఎన్నికల్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన తర్వాత జగన్ పార్టీలో చేరిపోయారు. అయితే 2014 ఎన్నిక్లలో దర్శి నుంచి పోటీ చేసిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆర్థికంగా నష్టపోయారు.దీంతో జగన్ 2019 ఎన్నికలలో టిక్కెట్ ఇస్తానని చెప్పినా ఆర్థిక కారణాలతో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీకి దూరంగా ఉన్నారు. దీంతో జగన్ మద్దిశెట్టి వేణుగోపాల్ కు టిక్కెట్ ఇవ్వడంతో ఆయన గెలిచారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన పదవుల కోసం ప్రయత్నిస్తున్నారు. తండ్రి మరణంతో కుటుంబ సమస్యలు కూడా తలెత్తాయి. దీంతో ఆర్థికంగా చితికిపోయారు. తమ కుటుంబానికి ఏదో ఒక పదవి ఇవ్వాలని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎప్పటి నుంచో జగన్ ను కోరుతున్నారు.ప్రస్తుతం ప్రకాశం జడ్పీ ఛైర్మన్ పేరును బూచేపల్లి వెంకాయమ్మ పేరును ఖరారు చేశారు. బూచేపల్లి వెంకాయమ్మ దర్శి నియోజకవర్గం నుంచి జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్థికంగా ఇబ్బందులున్నా పార్టీ కోసం పనిచేసిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కుటుంబానికి జగన్ న్యాయం చేశారంటున్నారు పార్టీ క్యాడర్. మొత్తం మీద చాలా రోజుల తర్వాత బూచేపల్లి కుటుంబానికి పదవి దక్కనుండటంతో వారి అనచరులు సంబరాలు చేసుకుంటున్నారు.

Related Posts