YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్ణాటకలో మారుతున్న పరిస్థితులు

 కర్ణాటకలో మారుతున్న పరిస్థితులు

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో విజ‌యం త‌మ సొంతం అని ఇన్నాళ్లూ ధీమాగా ఉన్న కాంగ్రెస్ నేత‌ల్లో ఒక్క‌సారిగా క‌లవ‌రం మొద‌లైంది. ఎన్నిక‌ల స‌ర్వేల‌న్నీ త‌మ‌కు అనుకూలంగా ఉన్నాయ‌ని.. ఇక తాము రెండోసారి అధికారంలోకి రావ‌డం త‌థ్య‌మనే ఆశ‌లో ఉన్న వీరి క‌ల‌ల‌న్నీ స‌ర్వేలు క‌ల్ల‌లు చేసేస్తున్నాయి.క‌ర్ణాట‌క ఎన్నిక‌ల వైపు దేశంలోని ప్ర‌జ‌లంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. సెమీఫైన‌ల్స్‌గా భావిస్తున్న ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీ నేత‌లు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. మ‌రోసారి విజ‌యం సాధించి అధికారంలోకి రావడంతో పాటు.. బీజేపీని దెబ్బ‌తీయాల‌ని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, సీఎం సిద్ధ రామ‌య్య ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తు న్నారు.కొన్ని ప్రాంతాల్లో అనూహ్యంగా కాంగ్రెస్ గ్రాఫ్ ప‌డిపోవ‌డం.. బీజేపీకి క్ర‌మంగా ఆద‌ర‌ణ పెరుగుతుండ‌టం సీఎం సిద్ధ రామ‌య్య‌లో టెన్ష‌న్ పెంచుతోంది. ప్ర‌ధాని మోదీ ప్ర‌చారం త‌ర్వాత ప‌రిస్థితిలో మార్పు వ‌చ్చింద‌ని క‌మ‌ల‌నాథులు భావిస్తుంటే.. త‌మ అధినేత్రిని రంగంలోకి దించి డ్యామేజ్ కంట్రోల్ చేసే ప‌నిలో ప‌డ్డారు కాంగ్రెస్ నేత‌లు.  కాంగ్రెస్ విముక్త దేశ్ లో భాగంగా.. దేశాన్ని కాషాయ‌మ‌యం చేసేందుకు ప్రధాని మోడీ, ఆ పార్టీ అధ్య‌క్షుడు అమిత్ షా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌కు రోజులు దగ్గరపడేకొద్దీ ఈ టెన్షన్ అంతకంతకూ ఎక్కువవుతోంది. మొన్నటివరకూ బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా ఉందని భావించిన కాంగ్రెస్ నేతలకు తాజా పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. తాజాగా వెలువడు తున్న సర్వేలు కాంగ్రెస్ కు కంటి నిండా కనుకు లేకుండా చేస్తుంటే.. బీజేపీ నేతలు రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళుతున్నారు.కొద్ది రోజుల ముందు వరకు ముంబయి- కర్ణాకట ప్రాంతంలో బీజేపీ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదన్న మాటకు భిన్నంగా ఇప్పుడా పార్టీ అంతకంతకూ బలపడుతోంది. ఈ ప్రాంతానికి చెందిన బెళగావి.. బాగల్కోటె.. విజయపుర.. గదగ.. హావేరీ.. ధార్వాడ జిల్లాల్లో కలిపి మొత్తం 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నాయి. వీటిల్లో అత్యధికం కాంగ్రెస్ ఖాతాలో ఉన్నవి కాగా.. ఇప్పుడు పరిస్థితి మారినట్లుగా అంచనా వేస్తున్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడ కాంగ్రెస్ కు 31 స్థానాల్ని సొంతం చేసుకుంది. బీజేపీ 13 స్థానాల్లో మాత్రమే గెలవగలి గింది. బీజేపీ మూడు ముక్కలుగా చీలిపోవటం.. వర్గపోరు కారణంగా అతి తక్కువ సీట్లల్లో మాత్రమే గెలిచింది.ఈసారి ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ముంబయి.. కర్ణాటక ప్రాంతంలోనే గెలుస్తామని సీఎం సిద్ధరామయ్య ఎక్కువ అంచనాలు పెట్టుకోవటం ఇప్పుడు కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారింది. మారిన పరిస్థితుల్లో బీజేపీ ఇక్కడ లాభపడుతుందన్న సర్వే ఫలితాలు కాంగ్రెస్ కు షాకింగ్ గా మారాయి. తాజా అంచనాల ప్రకారం మొత్తం 50 సీట్లల్లో బీజేపీ 27 సీట్లల్లో కాంగ్రెస్ 21 స్థానాల్లో జేడీఎస్ 2 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే కాంగ్రెస్ కు భారీ నష్టం.. బీజేపీ పెద్ద ఎత్తున ప్రయోజనం పొందే వీలుంటుంది.  కొన్ని ప్రాంతాల్లో త‌మ‌కు తిరుగులేద‌నే నాయ‌కుల న‌మ్మ‌కం.. ఇప్పుడు క్ర‌మంగా త‌గ్గిపోతోంది. కాంగ్రెస్ కంటే ఒక‌డుగు వెనుక ఉన్న క‌మ‌ల‌నాథులు.. కీల‌క‌మైన ద‌శ‌లో పుంజుకున్నార‌ని స‌ర్వేల్లో స్ప‌ష్ట‌మ‌వుతుండ‌టంతో కాంగ్రెస్ నేత‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా పోతోంది.రోజులు గడిచే కొద్దీ ఫలితం సంక్లిష్టంగా మారతున్న నేపథ్యంలో కాంగ్రెస్ తమ మాజీ అధినేత్రి సోనియాగాంధీనికి ప్రచారంలోకి దింపుతున్నారు. మొన్న‌టివ‌ర‌కూ వార్ వ‌న్‌సైడ్ అనుకున్నా.. ఇప్పుడు మాత్రం ట‌ఫ్ అయిపోయింది.

Related Posts