YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కొవిడ్-19 కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.50,000 ఎక్స్‌ గ్రేషియా

కొవిడ్-19 కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.50,000 ఎక్స్‌ గ్రేషియా

కొవిడ్-19 కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.50,000 ఎక్స్‌ గ్రేషియా
న్యూఢిల్లీ సెప్టెంబర్ 23
కొవిడ్-19 కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.50,000 ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్న వారితో పాటు కొవిడ్-19 బాధితుల కుటుంబాలకు కూడా పరిహారం అందుతుంది. కరోనా కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) ప్రతిపాదన చేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.కొవిడ్‌ కారణంగా చనిపోయిన మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) నుంచి అందిస్తారు. ఇలాంటి మరణాలను కొవిడ్-19 కారణంగా చనిపోయినట్లు ధ్రువీకరించినందున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తారని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. చట్టం ప్రకారం నిబంధనల ప్రకారం కరోనా బాధితుల కుటుంబాలకు రూ.4 లక్షలు పరిహారం అందించేలా కేంద్రం, రాష్ట్రాలను ఆదేశించాలని కోరుతూ న్యాయవాదులు రీపక్ కన్సల్, గౌరవ్ కుమార్ బన్సాల్ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ‘సెక్షన్ 12 (iii) ప్రకారం, విపత్తుతో బాధపడుతున్న వ్యక్తులకు అందించే కనీస ఉపశమనం కోసం జాతీయ అథారిటీ మార్గదర్శకాలను సిఫారసు చేస్తున్నది. ఇందులో ప్రాణనష్టం జరిగినప్పుడు ఎక్స్‌గ్రేషియాతోపాటు ఇండ్లు, జీవనోపాధి పునరుద్ధరణ కోసం నష్టానికి సంబంధించిన సహాయం కూడా ఉంటుంది’ అని చట్టం చెప్తున్నదని పిటిషన్‌దారులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

Related Posts