బిజెపిని ఓడించండి, కాంగ్రెస్ ను గెలిపించండి అంటూ అశోక్ బాబు కర్ణాటక తెలుగు వారికి పిలుపు ఇవ్వడం ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపింది. అశోక్ బాబు ప్రభుత్వ ఉద్యోగిగా వుంటూ ఇలాంటి పిలుపులు ఎలా ఇస్తారని బిజెపి రాజ్యసభ సభ్యుడు నరసింహారావు భగ్గుమన్నారు. అశోక్ బాబు టిడిపి ఏజెంట్ గా పనిచేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సర్వీస్ రూల్స్ కి విరుద్ధంగా అశోక్ బాబు పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని. కానీ వారే ప్రోత్సహించి పనిచేయించడంతో ఎవరు ఎవరిపై చర్యలు తీసుకుంటారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాకర్ణాటక ఎన్నికల్లో తెలుగు ఓటర్లు అత్యంత కీలకం కానున్నారు. విద్య, ఉపాధి కోసం అక్కడికి వెళ్లిన వారు దశాబ్దాలుగా స్థిరపడిన తెలుగు కుటుంబాల ఓటర్లు దాదాపు కోటిమంది ఉంటారని ఒక అంచనా. ఆ లెక్కే ఇప్పుడు కన్నడ రాజకీయాన్ని తెలుగు వారి చుట్టూ తిప్పేలా చేస్తుంది. ఎపి కి ప్రత్యేక హోదా ను కేంద్రంలోని మోడీ ఇస్తానని మాట తప్పారంటు అక్కడ కాంగ్రెస్ కు ఓటు వేయాలంటూ ఇప్పటికే టిడిపి ప్రచారం మొదలు పెట్టేసింది. ఆ ప్రచారానికి అనుబంధంగా ఉద్యోగ సంఘాల నాయకుడు అశోక్ బాబు కర్ణాటకలో తెలుగు సంఘం ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళి బిజెపికి వ్యతిరేకంగా చేసిన ప్రచారం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. దాంతో పాటు టిడిపి వర్గాలు నిర్వహించిన ఈ సదస్సులో తమను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ వైసీపి, బిజెపి పార్టీలకు చెందిన అభిమానులు హల్చల్ చేయడంతో తెలుగు వారు రెండు మూడు గ్రూప్ లు గా చీలిపోవడంతో అంతా అయోమయం గందరగోళంగా మారిందిరు. మరోవైపు అశోక్ బాబు ను ప్రశ్నించేందుకు వచ్చామంటూ కొందరు ఆందోళన నిర్వహించారు. వారిని సమావేశంలో పాల్గొనకుండా నిర్వాహకులు అడ్డుపడటంతో కొద్దిసేపు ఘర్షణ వాతావరణం కొనసాగి తారువాత సర్దుమణిగింది. మొత్తానికి తెలుగు రాజకీయం కర్ణాటకలో ఎంతవరకు పనిచేస్తుందో కొద్ది రోజుల్లో తేలిపోనుంది.