YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పాన్ మసాలా యాడ్ నుంచి తప్పుకోండి

పాన్ మసాలా యాడ్ నుంచి తప్పుకోండి

పాన్ మసాలా యాడ్ నుంచి తప్పుకోండి
ముంబై, సెప్టెంబర్ 24,
పాన్ మసాలా బ్రాండ్‌లను ప్రోత్సహించే ప్రకటనలతో భాగం కావొద్దంటూ బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్‌ను నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ టొబాకో ఎరిడికేషన్ అనే స్వచ్ఛంద సంస్థ కోరింది. ఈ మేరకు ఆయనకు ఒక విజ్ఞప్తి లేఖను రాసింది. ‘‘పాన్ మసాలా యాడ్‌ నుంచి మీరు తప్పుకోండి. ఇలాంటి వాటిని ప్రోత్సహించడం సరికాదు’’ అంటూ కోరింది. ‘‘సర్రోగేట్ పాన్ మసాలా యాడ్స్‌ నుంచి వైదొలగండి. పొగాకు వినియోగానికి వ్యతిరేక ఉద్యమానికి మద్ధతుగా నిలవండి.’’ అని నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ టొబాకో ప్రెసిడెంట్ డాక్టర్ శేఖర్ సల్కర్ తాను రాచేసిన బహిరంగ లేఖలో కోరారు.పొగాకు, పాన్ మసాలా వినియోగం క్యాన్సర్, గుండె జబ్బులకు, దీర్ఘకాలిక అనారోగ్య సమ్యలకు, పల్మనరీ వ్యాధులకు కారణమవుతుందని వైద్య పరిశోధనల్లో తేలిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రమాకరమైన పదార్థాల వినియోగానికి సంబంధించిన యాడ్స్ ‌నుంచి తప్పుకోవాలని ఎన్జీవో కోరింది. అయితే, దీనిపై అమితాబ్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్ బచ్చన్.. సినిమాల్లోనే కాకుండా, అనేక యాడ్స్‌లలోనూ నటిస్తున్నారు. అలాంటి యాడ్స్‌లలో పాన్ మసాలా యాడ్స్ కూడా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా గుర్తింపు కలిగిన ఇలాంటి స్టార్స్.. పాన్ మసాలాలను ప్రోత్సహిస్తూ యాడ్‌లలో నటించడం వల్ల వాటిని వినియోగించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతారు. ఈ కారణంగానే అమితాబ్‌ను సదరు యాడ్స్‌ నుంచి వైదొలగాలని టొబాకో ఎరిడికేషన్ ఆర్గనైజేషన్ కోరింది

Related Posts