YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో మళ్లీ ఏడు వేల సీట్లు కోత

తెలంగాణలో మళ్లీ  ఏడు వేల సీట్లు కోత

తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య మరింత తగ్గేలా ఉంది. గత ఏడాది మేనేజిమెంట్ కోటా, ఇతర మైనార్టీ కాలేజీల్లోని సీట్లు 1,24,239 కాగా ఈ ఏడాది ఈ సీట్ల సంఖ్య 1,10,117కు తగ్గనున్నాయి. గత ఏడాది కన్వీనర్ కోటా సీట్లు 87 వేలు కాగా, ఈ ఏడాది కన్వీనర్ కోటా 80 వేల కంటే తక్కువ కానున్నాయి. 14 కాలేజీలకు ఈ ఏడాది ఎఐసిటీఇ అనుమతి నిరాకరించింది. గత మూడేళ్లలో వరుసగా తనిఖీల పేరుతో కాలేజీలపై ఉక్కుపాదం మోపిన యూనివర్శిటీ సౌకర్యాలు లేవనే సాకుతో 63వేల సీట్లు కోత విధించింది. కాలేజీల యాజమాన్యాలు మాత్రం తమకో రూలు, యూనివర్శిటీకి ఒక రూలా అంటూ వాదిస్తున్నాయి.మరో 9 కాలేజీలు నిర్వహణ భారంతో మూతకు సిద్ధమయ్యాయి. ఫార్మసీ, ఎంబిఎ, ఇంజనీరింగ్ కోర్సులను నిర్వహించే 297 కాలేజీలు ఈసారి అనుబంధ గుర్తింపునకు దరఖాస్తు చేశాయి. సౌకర్యాలు కల్పించడంపై నిర్బంధం విధించడం, అదే విధంగా ఫ్యాకల్టీకి, విద్యార్థులకు బయోమెట్రిక్ తప్పనిసరి చేయడంతో చాలా కాలేజీలు కోర్సులు నిర్వహించలేని పరిస్థితి వచ్చాయి. కొన్ని కాలేజీలు తమ లోపాలు సరిదిద్దుకుంటామని గడువు కోరడంతో వాటికి గడువు ఇచ్చారు. అయితే ఆ లోపాలను సరిదిద్దాయో లేదో పరిశీలించేందుకు అప్పీలు కమిటీలను నియమించారు. ఈ కమిటీలు పరిశీలించిన తర్వాత వాస్తవ స్థితి తెలియనుంది.

Related Posts