YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గుజ‌రాత్ అసెంబ్లీ తొలి మ‌హిళా స్పీక‌ర్‌గా నీమాబెన్ ఆచార్య‌!

గుజ‌రాత్ అసెంబ్లీ తొలి మ‌హిళా స్పీక‌ర్‌గా నీమాబెన్ ఆచార్య‌!

గుజ‌రాత్ అసెంబ్లీ తొలి మ‌హిళా స్పీక‌ర్‌గా నీమాబెన్ ఆచార్య‌!
అహ్మ‌దాబాద్ సెప్టెంబర్ 24
గుజ‌రాత్‌లో భూపేంద్ర ప‌టేల్ కొత్త‌గా మంత్రివ‌ర్గం కూడా కొలువుదీరింది. సెప్టెంబ‌ర్ 27, 28 తేదీల్లో అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో రెండు రోజుల పాటు జ‌రిగే ఈ స‌మావేశాల‌కు తొలిసారిగా ఓ మ‌హిళా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వ‌హించ‌నున్నారు. ఎమ్మెల్యే నీమాబెన్ ఆచార్య‌ను అసెంబ్లీ స్పీక‌ర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్న‌ట్లు తెలుస్తోంది. ఒక వేళ ఇదే జ‌రిగితే గుజరాత్ అసెంబ్లీకి తొలి మ‌హిళా స్పీక‌ర్‌గా నీమాబెన్ నిలిచిపోనుంది. అసెంబ్లీ స‌మావేశాల నేప‌థ్యంలో స్పీక‌ర్, డిప్యూటీ స్పీక‌ర్ ఎన్నిక కోసం అసెంబ్లీ సెక్ర‌టేరియ‌ట్ నామినేష‌న్ల‌ను ఆహ్వానించింది. దీంతో నీమాబెన్ ఆచార్య.. మంత్రి త్రివేది, చీఫ్‌విప్ పంక‌జ్ దేశాయ్‌తో క‌లిసి నామినేష‌న్ పేప‌ర్ల‌ను స‌మ‌ర్పించారు.బీజేపీ ఎమ్మెల్యే నీమాబెన్ ఆచార్యకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ కూడా పూర్తి స్థాయిలో మ‌ద్ద‌తు తెలిపింది. సెప్టెంబ‌ర్ 16వ తేదీన స్పీక‌ర్ పోస్టుకు రాజేంద్ర త్రివేది రాజీనామా చేసిన విష‌యం విదిత‌మే. దీంతో ఆ పోస్టు ఖాళీ అయింది. రాజేంద్ర త్రివేది సీఎం భూపేంద్ర ప‌టేల్ మంత్రివ‌ర్గంలో చేరారు. త్రివేది రెవెన్యూ, శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

Related Posts