YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ కు వెలిగొండ టెన్షన్

జగన్ కు వెలిగొండ టెన్షన్

ఒంగోలు, సెప్టెంబర్ 25, 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఇప్పుడు అనేక సమస్యలతో పాటు నీటి సమస్య కూడా ప్రధానంగా మారనుంది. ఇప్పటికే తెలంగాణతో తగువు పెట్టుకున్నారు. తొలినాళ్లలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సన్నిహిత్యాన్ని జగన్ నెరిపారు. కలసి కూర్చుని సమస్యలను పరిష్కరించుకుందామనుకున్నారు. కానీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో ఇద్దరి మధ్య తేడా కొట్టింది. దీంతో తెలంగాణతో ఇక సుదీర్ఘ కాలం తగవు తప్పేలా లేదు. ఎగువ రాష్ట్రం కావడంతో తెలంగాణకు నీటి వాటా విషయంలో అనేక ప్రయోజనాలున్నాయి. ఇరువురు సహకరించుకుంటేనే నీటి కష్టాలు నెరవేరతాయి. శ్రీశైలం నుంచి విద్యుత్తు ఉత్పత్తి జరుగుతూనే ఉంది. జగన్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసినా ఫలితం ఉండక పోవచ్చు. ఇప్పటికే ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టి జగన్ పెద్ద తప్పు చేశారని నీటిపారుదల శాఖ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ లో వెలిగొండ ప్రాజెక్టు ప్రస్తావన లేదు. దీంతో తిరిగి నోటిఫికేషన్ లో చేర్చాల్సిన బాధ్యత జగన్ పైనే ఉంటుంది. వెలిగొండ ప్రాజెక్టు దాదాపు తుది దశకు చేరుకుంది. వెనకబడిన ప్రకాశం జిల్లా వంటి ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు వరప్రదాయని లాంటిది. అలాంటి వెలిగొండ ప్రాజెక్టు కేంద్రం విడుదల చేసిన గెజిట్ లో లేకపోవడంతో ప్రకాశం జిల్లా ప్రాంత వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.ఇక ఇప్పుడు తెలంగాణతో పాటు కర్ణాటక కూడా జగన్ కు సమస్యగా మారింది. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచుతామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దిగువకు వచ్చే నీటి పరిమాణం తగ్గుతుంది. ఫలితంగా కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరుగుతుంది. ఈ సమస్య నుంచి బయటపడటం జగన్ కు అంత సులువు కాదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దారిలోకి రావడం ఈజీకాదు. భవిష్యత్ లో జగన్ కుఇది ప్రధాన సమస్యగా మారనుంది

Related Posts