YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

25 మందికి టిక్కెట్లకు నో ఛాన్స్

25 మందికి టిక్కెట్లకు నో ఛాన్స్

నెల్లూరు, సెప్టెంబర్ 25, 
తెలుగుదేశం పార్టీ ఈసారి అధికారంలోకి రావాలి. రాకుంటే ఇక దుకాణం మూసివేసుకోవాల్సిందే. ఈ విషయం పసుపు పార్టీలోని ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే చంద్రబాబుకు వచ్చే ఎన్నికలు సవాల్ గా మారననున్నాయి. చంద్రబాబుకు కూడా వయసు మీద పడటంతో ఆయన హుషారుగా పాల్గొనే చివరి ఎన్నికలు ఇవేనన్నది పార్టీ వర్గాలు సయితం అంగీకరిస్తున్న విషయం. ఈ నేపథ్యంలో చంద్రబాబు పార్టీ గెలుపు కోసం అన్ని చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు.వచ్చే ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల కోసం ఇప్పటి నుంచే వడపోత మొదలుపెట్టారు. ఏపీలో ఉన్న 175 నియోజకవర్గాలకు ఇప్పుడు ఇన్ ఛార్జిలు ఉన్నారు. కేవలం కొన్నింటికి మాత్రమే చంద్రబాబు ఇన్ ఛార్జిలను నియమించలేదు. ఇక చంద్రబాబు వరసగా సీనియర్లతో సమావేశమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కీలకంగా మారనుంది. ఇప్పటికే వరసగా రెండు సార్లు ఓటమి పాలయిన వారికి తిరిగి టిక్కెట్ ఇవ్వాలా? వద్దా? అన్న దానిపై చర్చిస్తున్నారు.వరసగా రెండు సార్లు ఓటమి పాలయిన నియోజకవర్గాల్లో పాత నేతలకు టిక్కెట్ ఇవ్వాలా? లేక కొత్త నేతలకు అవకాశం కల్పించాలన్న దానిపై చంద్రబాబు కసరత్తు ప్రారంభించారని తెలుస్తోంది. వరసగా రెండుసార్లు ఓటమి పాలయిన వారిపై సానుభూతి ఉంటుంది. వీరిలో పార్టీలో యాక్టివ్ గా ఉన్న నేతలకు తిరిగి టిక్కెట్ ఇవ్వాలని, దీనిపై సర్వే చేయించి ఫైనల్ నిర్ణయం తీసుకోవాలన్నది చంద్రబాబు అభిప్రాయంగా ఉంది.ఏపీలో 2014, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి ఓటమిపాలయిన వారు దాదాపు పాతిక నియోజకవర్గాలు ఉన్నట్లు గుర్తించారు. వీరి స్థానంలో ఆ నియోజవర్గంలో యాక్టివ్ గా ఉన్న పార్టీ నేతల పేర్లను కూడా చంద్రబాబు తెప్పించుకున్నారు. రెండు సార్లు వరస ఓటములను పొందిన వారికి ఈసారి టీడీపీలో టిక్కెట్లు దక్కడం కష్టమేనన్నది పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది. మొత్తం మీద టీడీపీ అధినేత చంద్రబాబు టిక్కెట్ల కేటాయింపుపై కసరత్తు ఇప్పటి నుంచే ప్రారంభించారు.

Related Posts