న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25,
కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన సహకార శాఖ మంత్రి ఇవాళ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ సహకార సంస్థల మెగా సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో భాగంగా దేశ వ్యాప్తంగా వివిధ సహకార సంఘాలకు చెందిన 8 కోట్ల మంది సభ్యులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడనున్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ సమావేశం జరగుతుండగా.. ఈ కాన్ఫరెన్స్‌ను సహకార సంస్థలు IFFCO, నేషనల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అమూల్, సహకార భారతి, NAFED, KRIBHCOతోపాటు ఇతర సంస్థలు నిర్వహిస్తుండటం విశేషం.ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో మనం మరింత పురోగతిని చూడాల్సిన అవసరం ఎంతో ఉందని సహకారశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ఇఫ్కో 1966 లో 77 సొసైటీలతో ప్రారంభమైందని చెప్పిన ఆయన.. ఇఫ్కోలో ప్రస్తుతం 3.5 కోట్ల మంది రైతులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. మరింత మంది రైతులు దీనిలో పాలుపంచుకుంటేనే మంచి ఫలితాలు సాధించగలమని అమిత్ షా పేర్కొన్నారుదేశంలో సహకార రంగాన్ని ఆధునీకరించి శాస్త్రీయంగా మార్చాల్సిన అవసరం ఉందని మంత్రి అమిత్ షా చెప్పారు. అందుకే కేంద్రం సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. ఇక మీదట రైతుల రుణాలలో 25 శాతం సహకార రంగంలోనే నిర్వహించబడతాయని చెప్పారు.కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ అత్యంత ఆవశ్యకమన్న అమిత్ షా.. ఈ రంగం $ 5 ట్రిలియన్ ఆర్ధిక వ్యవస్థను కలిగి ఉందన్నారు. గ్రామీణాభివృద్ధి దేశాభివృద్ధికి ఈ రంగం ఎంతో దోహదపడుతుందని కేంద్ర సహకార మంత్రిత్వశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సహకార రంగాన్ని దేశంలోని అన్ని ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు అమిత్ షా. సహకారాన్ని మన వ్యక్తిత్వ లక్షణంగా తీసుకురావాలని అమిత్ షా పేర్కొన్నారు.కేంద్ర సహకార శాఖ ఆవశ్యకతను ప్రశ్నించిన విపక్ష నేతలకు కేంద్రమంత్రి అమిత్ షా సభా ముఖంగా సమాధానమిచ్చారు. దేశంలో తుఫాను, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుని దేశ గ్రామీణ ప్రజలు తట్టుకునేందుకు సహకార రంగం చాలా దోహదపడిందని అమిత్ షా చెప్పారు. 1947 సహకార రంగం దేశంలో పరిఢవిల్లుతోందని అమిత్ షా అన్నారు.దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీ జయంతి రోజు ఈ సభ జరుగుతుండటం సంతోషకరం దేశంలో అగ్రశ్రేణి రాజకీయ నేత పండింట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీ జయంతి రోజున ఈ సహకార సదస్సు జరుగుతుండటం చాలా ఆనందకరంగా ఉందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు.