ఆరోగ్య, విద్యా రంగంలో మౌలిక సదుపాయాల కల్పన
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
ముంబై సెప్టెంబర్ 25
వైద్యారోగ్య రంగంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. దేశానికి కనీసం 600 మెడికల్ కాలేజీలు, 50 ఎయిమ్స్ లాంటి సంస్థలు, 200 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఆవసరం ఉందని నితిన్ గడ్కరీ అన్నారు. పబ్లిక్, ప్రయివేటు భాగస్వామ్యంతో ఆరోగ్య, విద్యా రంగంలో మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్నారు.మహారాష్ట్ర సతారా జిల్లాలోని కరాడ్ సిటీలో కొవిడ్ వారియర్స్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సన్మానించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. మెడికల్ సదుపాయాల కల్పన కోసం కోఆపరేటివ్ సెక్టార్ ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ఒకసారి ప్రధాని మోదీతో చర్చ జరిగినప్పుడు.. వెంటిలేటర్ల కొరత గురించి చెప్పాను. దేశంలో ప్రస్తుతం ఎన్ని వెంటిలేటర్లు ఉన్నాయని మోదీ తనను ప్రశ్నించారని గడ్కరీ చెప్పారు. 2.5 లక్షల వెంటిలేటర్లు ఉండాలని, ఆ మేరకు అవసరం ఉందని తాను ప్రధానికి చెప్పాను. కానీ కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో కేవలం 13 వేల వెంటిలేటర్లు మాత్రమే దేశంలో ఉన్నాయని మోదీ చెప్పారని గడ్కరీ తెలిపారు.కరోనా సమయంలో ఆక్సిజన్ కొరతతో పాటు బెడ్లు, ఇతర మెడికల్ సదుపాయాల కొరత ఉన్‌ుట్లు పేర్కొన్నారు. కానీ డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, నర్సులు తమ విలువైన సమయాన్ని కరోనా రోగులకు కేటాయించి, వారి ప్రాణాలను కాపాడారని కేంద్ర మంత్రి ప్రశంసించారు. దేశానికి కనీసం 600 మెడికల్ కాలేజీలు, 50 ఎయిమ్స్ లాంటి సంస్థలు, 200 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఆవసరం ఉందని నితిన్ గడ్కరీ అన్నారు. అలాగే ప్రతి తహసీల్ పరిధిలో ఒక వెటర్నరీ హాస్పిటల్ ఉండాలని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.