త్వరలో నూతన సహకార విధానం
హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ సెప్టెంబర్ 25
: కేంద్ర ప్రభుత్వం త్వరలో నూతన సహకార విధానాన్ని ప్రకటిస్తుందని హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా శనివారం వెల్లడించారు. దేశ అభివృద్ధిలో సహకార మంత్రిత్వ శాఖ అద్భుత సామర్ధ్యంతో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జాతీయ సహకార సదస్సును ఉద్దేశించి అమిత్ షా ప్రసంగించారు.ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల వేళ నూతన సహకార విధానాన్ని తీసుకువస్తున్నామని ఇది గ్రామీణ సమాజాన్ని బలోపేతం చేస్తుందని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు దేశంలో 91 శాతం గ్రామాల్లో సహకార సంస్ధలు పనిచేస్తున్నాయని చెప్పారు. దేశ ఆర్ధిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లకు ఎదిగేందుకు సహకార వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.