YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కారు నుంచి కాంగ్రెస్ లోకి...

కారు నుంచి కాంగ్రెస్ లోకి...

ఖమ్మం, సెప్టెంబరక 27, 
డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఊపందుకున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ రామచంద్రనాయక్ అన్నారు. ఆదివారం గ్రామ పంచాయతీ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ జెండా గద్దెను ఆవిష్కరించి అనంతరం కళాకారులతో నృత్యాలు చేస్తూ డప్పుచప్పుల్లతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు భరత్ చంద్ర రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన కంచనపల్లి యాకయ్య, మొగలగాని రాజు, చాగంటి వెంకన్న, అశోక్, విస్సంపల్లి బాబు, చాగంటి ఎల్లయ్య, వీరస్వామి, జనార్ధన్, నాగయ్య, బాలకృష్ణ, భిక్షం, ఉపేందర్, తదితరులను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీలను కూడా పూర్తి చేయలేదని అన్నారు. గ్రామంలోని వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ ఇవ్వడం లేదని, రేషన్ కార్డు ఇవ్వలేదని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడం లేదని తన ఆవేదనను కాంగ్రెస్ పార్టీ నాయకులతో వృద్ధ మహిళలు, వికలాంగులు వెళ్లబోసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలందరికీ రూ.10 లక్షల రూపాయలు ఇవ్వాలని, రూపాయి ఖర్చు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించాలని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన, డోర్నకల్ నియోజకవర్గంలో రెడ్యానాయక్ కుటుంబ పాలన సాగుతోందని అన్నారు.చదువుకున్న మేధావులు, యువత మౌనం వీడాలి అన్నారు.
వరంగల్ లోనూ..అంతే
కమిటీల్లో చోటు ల‌భించ‌లేద‌ని గ్రామ‌స్థాయి నేత‌లు అస‌మ్మతి స్వరం వినిపిస్తుడ‌టంతో ముఖ్య నేత‌ల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి సంస్థాగ‌త నిర్మాణం బ‌లంగా ఉండాల‌నే కేసీఆర్ సూచ‌న‌ల‌తో గ్రామ‌, మండ‌ల‌, నియోజ‌క‌వ‌ర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి క‌మిటీల నిర్మాణానికి కార్యాచ‌ర‌ణ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా విష‌యానికి వ‌స్తే ఇప్పటికే గ్రామాల క‌మిటీలు దాదాపుగా పూర్తయ్యాయి. ఇప్పటికే చాలా మండ‌లాల‌కు కూడా క‌మిటీల‌ను ప్రక‌టించ‌డం గ‌మ‌నార్హం. ఇంకా కొన్నింటికి సంబంధించి ఎంపిక‌ ప్రక్రియ కొన‌సాగుతూనే ఉంది.కులాలు, ఓట్ల సంఖ్య ఆధారంగానే చాలా వ‌ర‌కు గ్రామ క‌మిటీల్లో నేత‌ల‌కు అవ‌కాశం క‌ల్పించిన‌ట్లుగా ఆ పార్టీ ముఖ్య నేత‌లు అంగీక‌రిస్తున్నారు. అయితే వాస్తవానికి గ్రామ అధ్యక్షుల ఎంపిక ఎమ్మెల్యేల క‌నుస‌న్నల్లో జ‌రిగినట్లుగా తెలుస్తోంది. ఇక మండ‌లాల క‌మిటీల్లో పూర్తిగా ఎమ్మెల్యేల అనుచ‌రుల‌కు, అనునాయుల‌కే పెద్ద పీట వేసిన‌ట్లుగా స‌మాచారం. ఎమ్మెల్యేను కాద‌ని, ఎంపీనో, మంత్రినో, ఎమ్మెల్సీనో ఇంకా ఇత‌ర‌త్రా నేత‌ల‌ను న‌మ్ముకోవ‌డం, సొంతంగా ఎద‌గాల‌ని భావించిన నేత‌ల‌ను పూర్తిగా అణిచివేసిన‌ట్లుగా పార్టీ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ జ‌రుగుతోంది.పార్టీలో ప్రాధాన్యం ద‌క్కడం లేద‌ని టీఆర్ఎస్‌లో అస‌మ్మతి జ్వాల‌లు ఎగిసిప‌డుతున్నాయి. గ్రామ క‌మిటీలు ప్రక‌టించ‌క ముందే కొంత‌మంది నేత‌లు పార్టీకి దూరంగా ఉండి… ఇప్పుడు పార్టీని వీడేందుకు సిద్ధమ‌వగా… మరి కొంత‌మంది అవ‌కాశాల కోసం ఎదురు చూస్తున్నారు. గుంభ‌నంగా ఉన్నా… ఆచితూచి సమయం కోసం వేచి చూస్తున్నారు. కారు పార్టీలో త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌లేద‌ని కాంగ్రెస్‌లోకి జంప్ అయిన వారు ఇప్పటికే ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌నిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం. గ్రామాల్లో అయితే వార్డు మెంబ‌ర్లు మొద‌లు, ఉప స‌ర్పంచులు కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం. న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గంలోని న‌ల్లబెల్లి మండ‌లం ఆస‌రావెల్లి గ్రామ పంచాయ‌తీ ఉప స‌ర్పంచ్ గుండెబోయిన మంజుల సాంబ‌య్య పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. అలాగే ఇదే నియోజ‌క‌వ‌ర్గంలోని ఖానాపూర్ మండ‌లంలో రాగంపేట గ్రామ పంచాయ‌తీలోని ఉప‌స‌ర్పంచ్ మీసం ర‌వీంద‌ర్ కూడా అదే ప‌నిచేశారు. ఇలా ప్రతీ మండ‌లాల్లోని ఆయా గ్రామాల్లో గులాబీని వీడుతున్న నేత‌లు ఉంటుండ‌టం గ‌మ‌నార్హం. పార్టీల‌కు ప‌ల్లెలే ప‌ట్టుకోమ్మలు కావ‌డంతో మండ‌ల‌, నియోజ‌క‌వ‌ర్గ స్థాయి నేత‌ల్లోనూ కాసింత ఆందోళ‌న క‌లిగిస్తోందిప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలోని ఆత్మకూరు మండ‌ల పార్టీ మాజీ అధ్యక్షుడు, సీనియ‌ర్ టీఆర్ఎస్ నేత‌గా ఉన్న కానుగంటి సంప‌త్‌కుమార్ పార్టీలో ప్రాధాన్యం ఇవ్వక‌పోవ‌డంపై ఎమ్మెల్యేను నియంతగా పేర్కొన్నారు. పార్టీలో ఇక‌పై క్రియాశీల‌కంగా ప‌నిచేయ‌బోన‌ని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేకు పార్టీ బ‌లోపేతంపై, గ్రామాల్లో స‌మ‌న్వయంపై చిత్తశుద్ధి లేదంటూ కాసింత ఘాటుగానే ఓ పోస్టులో పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఈ మేరకు ఆయన సోష‌ల్ మీడియాలో పెట్టిన వాట్సాప్ పోస్టు ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అంటూనే, పార్టీ నిర్మాణంలో మీరు పెద్ద నియంత అంటూ చ‌ల్లాను విమ‌ర్శించారు.అసెంబ్లీలో మళ్లీ మీరు గెలవడానికి ముందుచూపు తప్ప, గ్రామాల్లో ఎలాంటి సమన్వయం మీకు అనవసరం అంటూ తూర్పార బ‌ట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి చట్టాలు అమలు చేయాలన్నా అట్టి విషయంలో అఖిలపక్ష పార్టీలతో భేటి అయి చర్చించుతారు. కానీ ఇక్కడ మీరు ఉద్యమపార్టీ అయిన టీఆర్ఎస్ నియోజకవర్గ పార్టీ నిర్మాణంలో ఏఒక్కరినీ విచారించారూ.. అంటూ విమ‌ర్శించారు. జవాబుదారితనం లేని పాత్ర పోషించదలచుకోలేదు. నేను సెలవు తీసుకుంటున్నానంటూ చ‌ల్లాకు సెగ పుట్టించే వ్యాఖ్యలు చేయ‌డం విశేషం.

Related Posts