రంగారెడ్డి, సెప్టెంబర్ 27,
మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు, మొహబ్బత్ నగర్, అమీర్ పేట్, ఆకాన్ పల్లి, పొరండ్ల, కోళ్ల పడకల్, మాణిక్యమ్మ గూడ, చిన్నతూప్ర గ్రామాలతో పాటు, మరికొన్ని గ్రామాలలో లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వం లాక్ డౌన్ విధించినప్పటి నుంచి గ్రామాలలో పలు కిరాణా దుకాణలాల్లో, హోటల్స్ లో మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. కిరాణా దుకాణలల్లో, హోటలు నడిపేవారు, ఎలాంటి అనుమతి లేకుండా మద్యంను అమ్ముతున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. ఒక్క క్వాటర్ బాటిల్ (సీసా) కు 20 – 30 రూపాయలు, బీరు సీసాకు 20 -30 వరకు అదనంగా తీసుకొని అమ్ముతున్నారు.విచ్చల విడిగా మద్యం అమ్మకాలు జరుపుతున్న కిరాణా దుకాణాల వైపు, హోటల్స్ వైపు ఎక్సైజ్ శాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేదని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. మద్యం అమ్మకాలు జరుగుతున్నా దుకాణాల వైపు ఎక్సైజ్ శాఖ అధికారులు తమకేమి పట్టింపు లేనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కిరాణా దుకాణలల్లో, హోటల్లో ఉదయం ఆరుగంటల కే మద్యం అమ్మకాలు మొదలు పెడుతున్నారని గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు గ్రామాలల్లో అనుమతి లేకుండా మద్యం అమ్ముతున్న దుకాణలపై చర్యలు తీసుకోవాలంటున్నారు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఎక్సైజ్ సీఐ వీణారెడ్డి.. గ్రామాలలో హోటలల్లో, కిరాణా షాప్ లల్లో మద్యం అమ్మడానికి ఎలాంటి అనుమతులు లేవు. ఒకవేళ కిరాణాషాప్ లల్లో, హోటల్స్ లో ఎవరైనా మద్యం అమ్మితే, ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు.