YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

అక్రమాల పుట్టగా రిజిస్ట్రేషన్ శాఖ

అక్రమాల పుట్టగా రిజిస్ట్రేషన్ శాఖ

విశాఖపట్టణం, సెప్టెంబర్ 27,
రిజిస్ట్రేషన్ శాఖలో తవ్వేకొద్ది అక్రమాలు బయటకొస్తున్నాయి.. ఈ శాఖలో కొందరి ఆగడాలకు హద్దే లేకుండా పోయింది. 2018-19 సంత్సరానికి ముందు జరిగిన రిజిస్ట్రేషన్లలో ఏది ముట్టుకున్నా.. దాని వెనుక ఏదో ఒక అక్రమం బయటపడుతోంది. మొన్నటి వరకు నకిలీ చలానాలు వ్యవహారం దుమారం రేపితే.. ఇప్పుడు ఏకంగా చలనాలే లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు బయట పడింది.ప్రజల సౌకర్యాల కోసం సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేయాలి.. ఇదీ ప్రజలకు ప్రభుత్వ సేవలను దగ్గర చేసేందుకు తీసుకున్న ప్రయత్నాలు. అయితే కొందరు అవినీతి అధికారులు మాత్రం దొరికినంత దోచుకో అనే తరహాలో ముందుకు సాగుతున్నారు.ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అనంతపురం జిల్లాలోని రిజిస్ట్రేషన్ శాఖ. జిల్లాలో కొన్ని రిజిస్ట్రేషన్ శాఖల్లో జరిగిన అక్రమాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మక మానవు. నిషేధిత భూములకు రిజిస్ట్రేషన్ల దగ్గర మొదలై.. నకిలీ చలానాలు సృష్టించడం.. అసలు చలానాలే లేకుండా రిజిస్ట్రేషన్లు చేసేంత బరి తెగింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల అధికారులు చేస్తున్న తనిఖీల్లో విస్తూపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.2018లో సీఎస్ఎంఎస్ విధానం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి జరిగిన రిజిస్ట్రేషన్ల లావాదేవీలు, వాటి చలాన్లపై రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు చేయగా… ఇప్పటివరకు ఆరు డాక్యూమెంట్లకు సంబంధించి 16 నకిలీ చలానాల ద్వారా 2.96 లక్షలను పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. మరో 38 దస్తావేజుల రిజిస్ట్రేషన్ కోసం వివిధ పద్దుల కింద 107 చలానాలపై సొమ్ము చెల్లించారు.సీఎఫ్ఎంఎస్ లో సాంకేతిక లోపం కారణంగా ఈ సొమ్ము ప్రభుత్వ ఖాతాకు జమకాలేదు. దీనిపై ప్రాథమికంగా పరిశీలించకుండానే దస్తావేజుల రిజిస్ట్రేషన్‌ను పూర్తిచేశారు. 2018-19కి సంబంధించి 21.29 లక్షల సొమ్ము ప్రభుత్వ ఖాతాకు చేరలేదని గుర్తించారు అధికారులు. గతంలో కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసిన సబ్ రిజిస్ట్రార్ నాసిర్ ను విచారిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్నట్లు సమాచారం. అప్పట్లో సబ్ రిజిస్ట్రార్ సెలవుపై వెళ్లటంతో ఇన్ ఛార్జిగా పనిచేసిన జానియర్ అసిస్టెంట్ హరీష్ కూడా నకిలీ చలానాల ఆధారంగా 4 దస్తావేజులను రిజిస్ట్రేషన్ చేశారని అధికారుల తనిఖీల్లో తేలింది. మూడేళ్ల డాక్యుమెంట్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో నిషేధిత భూములకు, ప్రభుత్వ భూములకు కూడా రిజిస్ట్రేషన్లు జరిగాయన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కూడా విచారణ సాగుతున్నట్టు సమాచారం.

Related Posts