శ్రీకాకుళం
గతరాత్రి తీరందాటిన గులాబ్ తుపాను పశ్చిమంగా పయనించి కళింగపట్నానికి 120 కిలోమీటర్ల దూరాన బలహీనపడి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిసాల మీద తీవ్ర వాయుగుండంగా కేంద్రీకృతమై ఉంది. తీవ్రవాయుగుండం క్రమంగా పశ్చిమ వాయవ్యంగా పయనించి మరో ఆరుగంటల్లో మరింత బలహీనపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో నేడు తెలంగాణ ఉత్తర కోస్తాంధ్రలలో భారీ, అతిభారీ వర్షాలు పడతాయి. కొన్నిచోట్ల కుంభవృష్టి కురుస్తుంది.