YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

అమెరికా నుంచి భారత్ వస్తువులు

అమెరికా నుంచి భారత్ వస్తువులు

న్యూయార్క్, సెప్టెంబర్ 27, 
భారత ప్రధాని మోడీ అమెరికా పర్యటన ముగిసింది. అమెరికా పర్యటన సందర్భంగా మోడీకి అమెరికా కొన్ని కానుకలను అందజేసింది.  ఈ పర్యటనలో ప్రధాని మోడీ యుఎస్ ప్రెసిడెంట్ బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్, ఆస్ట్రేలియా పీఎం, టాప్ సీఈవోలతో భేటీ అయ్యారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మోడీ బైడెన్ లు ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతం, వాణిజ్య, వారసత్వ సంపద, సాంస్కృతిక వంటి పలు అంశాలపై గురించి చర్చించారు. ఈ సందర్భంగా మోడీకి అమెరికా  157 కళాకృతులు, పురాతన వస్తువులను బహుమతిగా అందజేసింది. ఆ బహుమతులను మోడీ ఎంతో ఆసక్తిగా పరిశీలించారు.. ఆ బహుమతులను ప్రధాని మోడీ తనతో పాటు భారత్ కు తీసుకురానున్నారు. ఇరుదేశాల మధ్య దొంగతనం, అక్రమ వ్యాపారం,  సాంస్కృతిక వస్తువుల అక్రమ రవాణాను సంయుక్తంగా ఎదుర్కోవడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.ఈ బహుమతులు అన్నీ 11వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దానికి చెందిన వస్తువులు అని తెలుస్తోంది. ఈ కానుకలో దాదాపు సగం కళాఖండాలు (71) సాంస్కృతికవి అయితే, మిగిలిన సగం హిందూ మతం (60), బౌద్ధమతం (16) మరియు జైనమతం (9) కు సంబంధించిన బొమ్మలున్నాయి. ఈ కానుకలో లక్ష్మీ నారాయణ, బుద్ధుడు, విష్ణువు, శివ పార్వతి , 24 మంది జైన తీర్థంకరులు , కంకలమూర్తి, బ్రాహ్మీ , నందికేసుల ప్రసిద్ధ భంగిమలతో అలంకరించబడిన బొమ్మలు ఉన్నాయిఇదే విషయంపై ప్రభుత్వ అధికారులు స్పందిస్తూ.. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 2021 మధ్యలో 200కి పైగా పురాతన వస్తువులు ఇతర దేశాలనుంచి మనదేశానికి తిరిగి వచ్చాయని తెలిపారు. అంతేకాదు ఇప్పుడు అమెరికా భారత్ కు అందజేసిన వస్తువులను గురించి తెలుపుతూ.. అవి ఎక్కువుగా 11వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దానికి చెందిన వస్తువులతో పాటు 2000 బీసీ కాలం నాటి రాగి, టెర్రాకోట వంటి చారిత్రక పురాతన వస్తవులను తెలిపారు.హిందూ మతానికి చెందిన మూడు తలల బ్రహ్మ, రథాన్ని నడిపిస్తున్న సూర్యుడు, విష్ణు లక్ష్మీదేవి. శివుడు దక్షిణామూర్తిగా, గణేశుడు నృత్యంభంగిమ కాగా ఇక  బౌద్ధమతానికి చెందిన బుద్ధుడు, బోధిసత్వ మజుశ్రీ, తారా విగ్రహాలు ఉన్నాయి. ఇక జైనమతానికి చెందిన జైన్ తీర్థంకర, పద్మాసన తీర్థంకర, జైన చౌబిసి వంటి అనేక విగ్రహాలు మోడీ భారత్ కు తిరిగి తీసుకుని రానున్నారు.

Related Posts