YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తుపాను బాధితులకు టీడీపీ నేతలు, కార్యకర్తలు అండగా నిలవాలి

తుపాను బాధితులకు టీడీపీ నేతలు, కార్యకర్తలు అండగా నిలవాలి

అమరావతి
టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత  నారా చంద్రబాబు నాయుడు పత్రికా ప్రకటన విడుదల చేసారు. గులాబ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలవాలి. - ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టి నష్టాన్ని నివారించాలి.  రాష్ట్రంలో గులాబ్ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.   తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.   వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు.   తీరం వెంబడి బలమైన గాలులు వీస్తుండంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.   తుఫాను ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు తమ వంతు సాయం అందజేయాలి.   ప్రజలకు అవసరమైన నిత్యావసర సరకులతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించడంలో సహాయం అందించాలి.   వారికి అన్ని విధాల అండగా నిలవాలి.   గులాబ్ తుఫాను ప్రభావంపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.   విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి.  విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగకుండా అప్రమత్తంగా ఉండాలి.   ముందస్తు చర్యలు చేపట్టి నష్టాన్ని నివారించాలని అయన ప్రకటనలో పేర్కోన్నారు.

Related Posts