YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరంచిన మంత్రి హరీష్ రావు

కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరంచిన మంత్రి హరీష్ రావు

సిద్దిపేట
సిద్దిపేట గజ్వెల్ నియోజకవర్గంలో సోమవారం పలు శంకుస్థాపనలు భూమి పూజ, విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారుకొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి  పురస్కరించుకుని  సోమవారం గజ్వెల్ లో బాపూజీ విగ్రహ అవిష్కరణ చేసిన అనంతరం బాపూజీ అందించిన నిస్వార్థ సేవలను మంత్రి హరీష్ రావు స్మరించుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడైన బాపూజీ తన జీవితాంతం ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడారని గుర్తు చేశారు. అప్పట్లో బంగారు తెలంగాణ సాధించడమే ఆయనకు అసలైన లక్ష్యం  అని పేర్కొన్నారు.  1969 నుంచి  ప్రత్యేక తెలంగాణ పక్షాన నిలబడ్డ చరిత్ర బాపూజీదని కొనియాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రత్యేక తెలంగాణ సాధన కోసం అహర్నిశలు కృషి చేసారని, ప్రత్యేక తెలంగాణ డిమాండ్ని దేశవ్యాప్తంగా  ప్రచారం చేసిన నిస్వార్థ త్యాగి కొండ లక్ష్మణ్ బాపూజీ అని ఆయన సేవలు గుర్తు చేశారు. ఒక వ్యక్తి ఏకంగా 75 యేండ్ల పాటు నిరంతరాయంగా పీడిత ప్రజల పక్షాన నిలబడి, ప్రజా ఉద్యమాలను  నిర్వహించడం అసాధ్యమని ఆ...అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిన ఘనత కొండా లక్ష్మణ్ బాపూజీ దే  అని మంత్రి హరీష్ అన్నారు.  గజ్వెల్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ,కవియిత్రి మొల్ల విగ్రహాలను ఆవిష్కరించడం తో పాటు.. మెడికల్ అండ్ డ్రగ్స్,అంబెడ్కర్ భవన భూమిపూజ, తదితర కార్యక్రమాల్లో మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు

Related Posts