తగ్గుతున్న కరోనా
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27,
దేశంలో కరోనా ఉధృతి నానాటికీ పెరుగుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ పెరుగుతున్న కేసులు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 26,041 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. కరోనా మహమ్మారి కారణంగా 276 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,36,78,786 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,47,194 కి చేరింది.కాగా.. నిన్న కరోనా నుంచి 29,621 మంది కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,29,31,972 కి పెరిగినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 2,99,620 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కేరళ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తూనే ఉంది. నిన్న దేశంలో నమోదైన కరోనా కేసుల్లో కేరళలో 15,951 కేసులు నమోదు కాగా.. 165 మంది మరణించారు.ఇదిలాఉంటే.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 86,01,59,011 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 38,18,362 మందికి కోవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.