YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

భారత్ బంద్ పాక్షికం.. ప్రశాంతం

భారత్ బంద్ పాక్షికం.. ప్రశాంతం

భారత్ బంద్ పాక్షికం.. ప్రశాంతం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27
 కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. సంయుక్త కిసాన్‌ మోర్చా  ఆధ్వర్యంలో 500కు పైగా రైతు, ప్రజాసంఘాలు  భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి సోమవారానికి ఏడాదైన సందర్భంగా 40 రైతు సంఘాల ఉమ్మడి వేదికైన సంయుక్త కిసాన్‌ మోర్చా ఈ దేశవ్యాప్త నిరసన చేపట్టింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా సన్నాహాలు చేసినట్టు సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది. ఈ బంద్‌కు దేశంలోని పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్ జరగింది.రైతులు ప్రకటించిన బంద్‌కు కాంగ్రెస్ సహా వామపక్షాలు, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, పంజాబ్, తమిళనాడు ప్రభుత్వాలు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. బంద్‌కు ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడెరేషన్‌ కూడా మద్దతు తెలిపింది. బంద్‌ దృష్ట్యా ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాజధాని సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించారు.మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ నేపధ్యంలో తమిళనాడు నిర్మానుష్యంగా మారింది. అయితే చెన్నైలోని అన్నాసలై ప్రాంతంలో పోలీసు బారికేడ్లను రైతులు పగలగొట్టడంతో.. పరిస్థితి చెయ్యి దాటింది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.భారత్ బంద్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. మైలార్ దేవ్ పల్లి డివిజన్లో భారత్ బంద్ కార్యక్రమాల్లో రేవంత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పీసీసీ కార్యదర్శి సానం శ్రీనివాస్ గౌడ్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జలపల్లి నరేందర్, రంగారెడ్డి జిల్లా ఐ ఎన్ టి యు సి మైలార్ దేవ్ పల్లి డివిజన్ అధ్యక్షుడు ఎన్ ధనుంజయ, ఏఐటియుసి కార్యదర్శి జిల్లా వనం పల్లి జైపాల్ రెడ్డి, డివిజన్ ఉపాధ్యక్షులు గుర్రం శంకర్.. బొల్లం వెంకటేష్ సుధాకర్.. రవీందర్ రెడ్డి.. నాగరాజ్.. అంజి జాఫర్ శ్రీశైలం నిహాల్.. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.భారత్ బంద్ లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ.. ఆయా పార్టీల నేతలు ఆందోళన కారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజకవర్గం పరిధిలోని ఇస్నాపూర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగిన కాంగ్రెస్ పార్టీ, వామ పక్ష పార్టీల నేతలుహైదరాబాద్ సిటీ రోడ్ల మీద గుర్రపు బండ్లపై తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. గుర్రపు బండ్లను లోపలికి అనుమతించమని తేల్చిచెప్పారు. అనుమతించాలని కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పోలీసులు నారాయణగూడ పీఎస్కు తరలించారు. పెట్రోల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా గుర్రపు బండ్లపై అసెంబ్లీకి వెళ్తున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి.. ప్రజలపై భారం పడటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరే కారణమని మండిపడ్డారు.బీజేపీ సర్కారు తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్రం దిగొచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు CLP నేత భట్టి విక్రమార్క. హైదరాబాద్ లో రెండో రోజు కొనసాగుతున్న శాసనసభ వర్షాకాల సమావేశానికి కాంగ్రెస్ నేతలు గుర్రపు బండ్లపై వెళ్లారు. గాంధీభవన్నుంచి అసెంబ్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గుర్రపు బండ్లపై వెళ్లి కేంద్ర విధానాలపై నిరసన తెలిపారు. హస్తం నేతల ఈ తీరుతో.. రహదారిపై రద్దీ ఏర్పడింది. దీంతో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు.

Related Posts