YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మమత గెలుపు నల్లేరు మీద నడకే

మమత గెలుపు నల్లేరు మీద నడకే

కోల్ కత్తా, సెప్టెంబర్ 28, 
బెంగాల్ లో ఉప ఎన్నికలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ లో మూడు స్థానాలకు ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి మమత బెనర్జీ భవానీపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మమత బెనర్జీని ఓడించడానికి బీజేపీ శతవిధాలుగా ప్రయత్నిస్తుంది. ఇక్కడ పార్టీ విజయం కోసం సువేందు అధికారి మరోసారి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు రసవత్తరంగా సాగుతుందిపశ్చిమ బెంగాల్ లో కొంతకాలం క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమత బెనర్జీ ఓటమి పాలయ్యారు. తనకు పట్టున్న భవానీపూర్ ను కాదనుకుని ఆమె నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు. అయితే సువేందు అధికారి చేతిలో మమత బెనర్జీ పరాజయం పాలయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఎంసీ విజయం సాధించినా మమత బెనర్జీ ఓటమి పాలు కావడం విశేషం. అయితే మమత బెనర్జీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారుముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరునెలల్లో చట్ట సభలకు మమత బెనర్జీ ఎన్నిక కావాల్సి ఉంది. భవానీపూర్ లో విజయం సాధించిన టీఎంసీ నేత చేత రాజీనామా చేయించి మరీ ఆమె పోటీలోకి దిగుతున్నారు. మరోవైపు భవానీపూర్ ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ పార్టీ బాధ్యతలను సువేందు అధికారికి అప్పగించారు. ఆయన గత కొన్ని రోజులుగా అక్కడే మకాం వేసి పార్టీ విజయం కోసం పనిచేస్తున్నారు.ఇక బీజేపీ కేంద్ర మంత్రులు భవానీపూర్ చుట్టూనే ప్రదిక్షిణలు చేస్తున్నారు. కేంద్రమంత్రలు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తుండటం విశేషం. సువేందు అధికారి బృందం ప్రతి ఓటును కీలకంగా తీసుకుని ప్రయత్నం చేస్తుంది. ప్రచారం హోరెత్తిపోతుంది. అయితే ఇక్కడ మమత బెనర్జీని ఓడించడం అంత సులువు కాదు. పార్టీ అధికారంలో ఉండటం, మమత ముఖ్యమంత్రిగా ఉండటం వంటి కారణాలు బీజేపీ ఆశలపై నీళ్లు చల్లుతాయనే చెప్పాలి. మొత్తం మీద గెలుపు ముందే ఖరారయినా బీజేపీ మాత్రం కనీసం మెజారిటీ తగ్గించాలన్న ప్రయత్నంలో ఉంది.

Related Posts