YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెరాస నేతలపై వేటు

తెరాస నేతలపై వేటు

అధికార టిఆర్ఎస్ పార్టీ నేతలపై ఎట్టకేలకు వేటు పడింది. బంగారం కేసులో సంబంధం ఉన్న ఆర్మూరు  మున్సిపల్ చైర్మన్ భర్త తో పాటు మరో ఇద్దరు టిఆర్ఎస్ నాయకుల ను సస్పెండ్ చేశారు. దీంతో అధికార టిఆర్ఎస్ పార్టీలో బంగారం దొంగతనం కలకలం రేపుతోంది. అధికార పార్టీ నేతలను అరెస్ట్ చేయాలని కోరుతూ అర్ముర్ లో అఖిలపక్షం ఆధ్వర్యంలో గత వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. మంగళవారం అర్ముర్ బంద్ ను అఖిలపక్షం నేతలు నిర్వహిస్తున్నారు. 

అర్ముర్ పట్టణంలో గత నెల 22న నగల తయారీ కోసం తీసుకొని 3 కిలోల బంగారం తో అర్మూరు ఉదాయించిన భూపాల్ మున్నా వ్యవహారం మలుపులు తిరిగుతోంది. ఈ ఘటనలో సంబంధం ఉన్న ముగ్గురు టిఆర్ఎస్ నేతల పై కేసు నమోదైన నేపథ్యంలో అధిష్టానం వారిపై వేటు వేసింది. బంగారం తో పరారైన భూపాల్ మున్నా కు సహకరించడం లో అధికార పార్టీ నేతల హస్తం పై తీవ్ర విమర్శలు రావడం తో పార్టీ జిల్లా ఇంచార్జీ తుల ఉమ సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు. నగల తయారీ కోసం బంగారం తీసుకుని పరారైన నిందితుడు ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ లో వారం క్రితం అదుపులోకి తీసుకున్నారు అర్ముర్ పోలీసులు. కటక్ కోర్ట్ లో హాజరు పర్చగా టిఆర్ఎస్ నేత,  అర్ముర్ మున్సిపల్ చైర్మన్ స్వాతీ సింగ్ బబ్లు భర్త సంజయ్ సింగ్, 11వ వార్డ్ కొన్సిలర్ భర్త పింజ వినోద్, టిఆర్ఎస్ నేత సుంకరి రంగన్నలకు బంగారం ఇచ్చినట్లు పోలీసుల వాంగ్మూలం లో తేలింది. పోలీస్ కస్టడీ తీసుకొని భూపాల్ మున్నా ను విచారించగా బంగారం తో పాటు నగదును కూడా టిఆర్ఎస్ నేతలకు ఇచ్చినట్లు విచారణ లో తేలింది. ఈ కేసులో ఇప్పటి వరకు 617 గ్రాముల బంగారం, లక్షా15వెల నగదు ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 11 వార్డు కౌన్సిలర్ భర్త పింజ వినోద్ నుంచి 104 గ్రాములు, సుంకరి రంగన్న నుంచి 208 గ్రాములు, ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ భర్త సంజయ్ సింగ్ బబ్లు నుంచి 305 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అధికార పార్టీకి చెందిన ముగ్గురు నాయకులకు అర్ముర్ పోలీసులు నోటీసులు ఇచ్చి 41(ఏ) సీఆర్పీసి కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బంగారం అపహరణ వ్యవహారం లో అధికార పార్టీ నేతల హస్తం పై అర్ముర్ ప్రాంతం లో కలకలం రేపుతోంది. ఇంకా ఈ వ్యవహారం లో ఎంత మంది ఉన్నారనే కోణం లో విచారణ చేపట్టారు. బంగారం అపహరణ వ్యవహారం పై అర్ముర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తో పాటు నిజామాబాద్ ఎంపీ కవితకు ఫిర్యాదులు రావడం తో విచారణ జరిపి సస్పెన్షన్ వేటు వేశారు. మరోవైపు అర్ముర్ బంద్ లో అఖిలపక్షం నేతలు అద్వర్యం లో కొనసాగుతుంది.

Related Posts