YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

వర్క్ షాపులకు పెరిగిన డిమాండ్

వర్క్ షాపులకు పెరిగిన డిమాండ్

హైదరాబాద్, సెప్టెంబర్ 28, 
కరోనా  మొదటి వేవ్‌‌‌‌, సెకెండ్ వేవ్‌‌‌‌ దెబ్బకు మెకానిక్ షాపులు, వర్క్‌‌‌‌షాపుల రెవెన్యూలు తగ్గిపోయాయి. వర్క్‌‌‌‌ఫ్రమ్‌‌‌‌ హోమ్‌‌‌‌ విధానం పెరగడం,  రోడ్లపైన వెహికల్స్‌‌‌‌ పెద్దగా తిరగకపోవడం వలన వర్క్‌‌‌‌షాపుల వద్ద పనితగ్గిపోయింది. కరోనా ముందు స్థాయిలతో పోలిస్తే వెహికల్స్‌‌‌‌ రోజుకి తిరిగిన డిస్టెన్స్‌‌‌‌ 30–40 శాతం మేర తగ్గిందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.  రోడ్లపై యాక్సిడెంట్లు కరోనా టైమ్‌‌‌‌లో బాగా తగ్గాయి.  కరోనా ముందు రోజుకి సగటున 428  యాక్సిడెంట్‌‌‌‌ వలన మరణాలు ఉండేవి, కరోనా టైమ్‌‌‌‌లో సగటున 320 మరణాలు రికార్డయ్యాయి. ‘గత 18 నెలల్లో వర్క్‌‌‌‌షాపుల రెవెన్యూ 50 శాతం మేర తగ్గింది. ఆగస్ట్‌‌‌‌ నుంచి డిమాండ్ పెరుగుతోంది. కానీ, ఇంకా కరోనా ముందు స్థాయిలకు చేరుకోలేదు’ అని మహీంద్రా అండ్ మహీంద్రా డీలర్ ఒకరు పేర్కొన్నారు. కరోనా ప్రభావం డీలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ల వర్క్‌‌‌‌షాపులపై   ఎక్కువగా పడింది. డీలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌లకు 70 శాతం సర్వీస్‌‌‌‌ రెవెన్యూ వర్క్‌‌‌‌షాపుల నుంచే వస్తోంది. దీంతో కరోనా టైమ్‌‌‌‌లో కేవలం కొన్ని వర్క్‌‌‌‌షాపులు మాత్రమే తమ స్టాఫ్‌‌‌‌ను కొనసాగించగలిగాయని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. ‘కరోనా సెకెండ్ వేవ్‌‌‌‌ దెబ్బకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌‌‌‌ మొత్తం వృధా అయ్యింది. గత నెల నుంచి బిజినెస్‌‌‌‌ మెరుగుపడుతోంది’ అని నిస్సాన్‌‌‌‌ ఇండియా ఎండీ అరుణ్‌‌‌‌ మల్హోత్రా పేర్కొన్నారు. ‘కరోనా ముందు స్థాయిలకు వర్క్‌‌‌‌షాపులు తిరిగి చేరుకుంటాయని డీలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. యాక్సిడెంట్ వెహికల్స్ తక్కువగా వర్క్‌‌‌‌షాపులకు వస్తున్నాయి. యాక్సిడెంట్‌‌‌‌లో ఎక్కువగా డేమేజ్‌‌‌‌ అయితే మాత్రం  రిపేరింగ్ కాస్ట్ వెహికల్‌‌‌‌ కాస్ట్‌‌‌‌లో 50 శాతంగా ఉంటుంది’ అని  మారుతి సుజుకీ డీలర్‌‌‌‌‌‌‌‌ సుభాష్‌‌‌‌  గెహ్లట్‌‌‌‌ అన్నారు. మొత్తం 36 వర్క్‌‌‌‌షాపులను ఆయన ఆపరేట్ చేస్తున్నారు. కరోనా ముందు  ప్రతీ నెల కనీసం వెయ్యి వెహికల్స్ తమ వర్క్‌‌‌‌షాపులకు వచ్చేవని  గెహ్లట్‌‌‌‌ అన్నారు. సగటు రిపేర్ ఖర్చు రూ.70 వేలుగా ఉండేదని చెప్పారు.  డీలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌లకు  వర్క్‌‌‌‌షాపుల నుంచే ఎక్కువగా రెవెన్యూ వస్తోందని  హ్యుండయ్ డీలర్ ఒకరు చెప్పారు. ఈ రెవెన్యూ కరోనా సెకెండ్ వేవ్‌‌‌‌ టైమ్‌‌‌‌లో 75 శాతం పడిందని, ఇంకా రికవరీ కాలేదని పేర్కొన్నారు. కరోనా ముందు తన వర్క్‌‌‌‌షాపుకి నెలకు 200 కి పైగా వెహికల్స్ వచ్చేవని, రిపేర్ ఖర్చు సగటున రూ.  35 వేలుగా ఉండేదని చెప్పారు.  కరోనా టైమ్‌‌‌‌లో వెహికల్స్‌‌‌‌ వెనక వైపు జరిగే డ్యామేజ్‌‌‌‌ 40–50 శాతం మేర తగ్గిందని డీలర్లు చెబుతున్నారు. కానీ, పార్కింగ్‌‌‌‌ చేస్తున్నప్పుడు జరిగే యాక్సిడెంట్ల వలన వెహికల్స్‌‌‌‌ వర్క్‌‌‌‌షాపులకు ఎక్కువగా వచ్చాయన్నారు. మోటార్ ఇన్సూరెన్స్ క్లయిమ్స్‌‌‌‌ కరోనా టైమ్‌‌‌‌లో బాగా తగ్గాయి.  ఏడాది ప్రాతిపదికన చూస్తే ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌–జూన్ మధ్య మోటార్ ఇన్సూరెన్స్ క్లయిమ్స్‌‌‌‌ 60 శాతం మేర తగ్గాయని బజాజ్‌‌‌‌ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ చీఫ్‌‌‌‌ టెక్నికల్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ టీఏ రామలింగమ్ అన్నారు. కరోనా ముందు స్థాయితో పోలిస్తే 20 శాతం తగ్గాయని పేర్కొన్నారు.   ‘కిందటేడాది నేషనల్ లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ టైమ్‌‌‌‌లో  క్లయిమ్స్‌‌‌‌ భారీగా తగ్గాయి. ఈ ఏడాది మే లో మోటార్ క్లయిమ్స్‌‌‌‌ 50 శాతం మేర తగ్గాయి’ అని రామలింగం పేర్కొన్నారు. కిందటేడాది లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ టైమ్‌‌‌‌లో ట్రాఫిక్ పెద్దగా లేకపోవడం వలన మోటార్ క్లయిమ్స్‌‌‌‌ బాగా తగ్గాయని ఐఎఫ్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఓ టోకియో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ (క్లయిమ్స్‌‌‌‌) అభిజిత్‌‌‌‌ చటర్జీ అన్నారు. రిస్ట్రిక్షన్లు తొలగిపోయాక క్లయిమ్స్‌‌‌‌  బాగా పెరిగాయన్నారు. థర్డ్ పార్టీ (టీపీ) మెటార్ ఇన్సూరెన్స్ రేట్లను ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌‌‌‌మెంట్ అథారిటీ (ఐఆర్‌‌‌‌‌‌‌‌డీఏఐ)  2020-21, 2021-22 లో పెంచలేదు. ప్రతీ ఏడాది ఏప్రిల్‌‌‌‌లో  టీపీ రేట్లను ఐఆర్‌‌‌‌‌‌‌‌డీఏఐ ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌కు తగ్గట్టు పెంచుతుంటుంది. ఈ సారి వెహికల్స్ యాక్సిడెంట్లు తగ్గడంతో ఇన్సూరర్లకు వచ్చే క్లయిమ్స్‌‌‌‌ తగ్గాయి. దీంతో రేట్లను ఐఆర్‌‌‌‌‌‌‌‌డీఏఐ పెంచలేదు. అంతేకాకుండా ఇన్సూరెన్స్ రేట్లు పెరిగితే  కొత్త కార్ల రేట్లు కూడా పెరుగుతాయి. దీంతో వెహికల్స్ సేల్స్‌‌‌‌ తగ్గొచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు. కొన్ని  ఇన్సూరెన్స్ కంపెనీలు మాత్రం  టీపీ ప్రీమియం తక్కువగా ఉందని, పెంచాలని కోరుతున్నాయి.

Related Posts