YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాంగ్ రూట్ లో క‌మ‌లం దారా...

రాంగ్ రూట్ లో క‌మ‌లం దారా...

విజ‌య‌వాడ‌, సెప్టెంబ‌ర్ 28, 
బీజేపీకి రాజకీయం తెలియదు అనుకోవడానికి లేదు కానీ అతి ఉత్సాహం మాత్రం ఉందని అర్ధమవుతోంది. లేకపోతే కొత్తగా ఈడొచ్చిన పిల్లలా తెగ హుషార్ చేస్తోంది. నిజానికి ఏపీలో బీజేపీకి ఇపుడు రాజకీయంగా ఏ మాత్రం సానుకూలత లేదు అన్నది రాజకీయం తెలిసిన వారు అంటున్న మాట. ఏపీకి బీజేపీ చేసిన ద్రోహం జనాలకు కళ్ళ ముందు ఉంది. కాంగ్రెస్ పక్కనే బీజేపీని నిలబెడుతున్నారు. మరి బీజేపీకి ఈ హడావుడి ఎందుకు వచ్చింది అంటే కేంద్రంలో ఉంది కాబట్టి అన్న సమాధానమే వస్తోంది. మోడీని చూపించి ఏపీని కొల్లగొడదామనుకుంటే మళ్లీ నోటాతోనే పోటీ పడాలని కూడా అంటున్నారు.టీడీపీ చలువతో 2014 ఎన్నికల్లో గెలిచిన విష్ణు కుమార్ రాజు లాంటి వారు ఇపుడు పెద్ద నోరు చేస్తున్నారు. వైసీపీ సర్కార్ మరో మూడున్నరేళ్ళు అధికారంలో కొనసాగడం కష్టమట. ఇలాంటి పిల్లి శాపాలు పెట్టిన చంద్రబాబు ఇపుడు గమ్మున ఉన్నారు. అది అధికార యావ. అత్యాశ అని జనం కూడా అర్ధం చేసుకున్నారు కాబట్టే బాబు కంప్లీట్ సైలెంట్ అంటున్నారు. అయినా బాబు అనుకున్నా ఏదోలే అనుకోవచ్చు. మొత్తం ఏపీలోని 175 సీట్లల్లో క్యాడర్ ఉంది కాబట్టి బాబు సై అన్నా చెల్లుతుంది. ఇప్పటికిపుడు ఎన్నికలు పెట్టినా టీడీపీయే వైసీపీని ఎదుర్కొనే పార్టీ అన్నది ఆ మాత్రం రాజకీయం తెలిసిన వారికి కూడా అర్ధమయ్యే విషయం. కానీ బీజేపీకి ఏపీలో ఏముందో కానీ ఎగిరెగిరిపడడమే కాదు తమ వాచాలత్వం కూడా నేతలు చూపిస్తున్నారు. ఇదే ఆ పార్టీని మరింతగా దెబ్బ తీస్తుందని అంటున్నారు. అయినా ఓడగొట్టడానికి జగన్ మరీ అంత తేలికగా కనిపిస్తున్నారా అన్నదే పెద్ద చర్చ.ఇక బీజేపీలో మరో నేత ఉన్నారు. ఈయన కనీసం ప్రజా ప్రతినిధిగా ఇప్పటిదాకా నెగ్గినది లేదు. తానున్న రాయలసీమ ప్రాంతంలో బీజేపీకి అన్ని చోట్లా ఎపుడూ డిపాజిట్లు రాక‌పోవడమే ఆయనకూ తెలుసు. అయినా గట్టి హెచ్చరికలు చేస్తున్నాడు. బీజేపీతో పెట్టుకుంటే నిప్పుతో చెలగాటమేనట. మాతో పెట్టుకోవద్దు జగన్ అంటూ గట్టిగానే సవాల్ చేస్తున్నాడు. అయినా పెట్టుకోవడానికి ఏపీలో బీజేపీ ఎక్కడ ఉందని విష్ణు ఇలా అంటున్నారో అర్ధం కావడంలేదు కదా. అంటే ఒక అంతర్వేది, ఒక అమలాపురం అంటూ చలో పోలో అంటే అదే బీజేపీకి బలం బలగం అని రెడ్డి గారు ఎలా అనుకుంటున్నారో ఎవరికీ అర్ధం కాదు. టీవీల ముందు కూర్చుని డిబేట్లలో తొడగొట్టడం కాదు పోలింగ్ బూత్ వద్ద ఓట్లు తేవడం ఎలా అన్నది బీజేపీ నేతలు మరచిపోబట్టే ఈ నేల విడిచి సాము చేస్తున్నారు అనిపిస్తోంది.మతం ఒక మత్తు మందు అంటారు మేధావులు. నిజానికి ఆ మత్తు ఇపుడు చాలా మందికి పూర్తిగా దిగిపోయింది. వివిధ కారణాల వల్ల, ఆర్ధిక సమస్యల వల్ల ఎవరి మత విశ్వాసాలు ఎవరికి వారు పాటిస్తూ పొట్ట కూటి కోసం నానా పాట్లు పడుతున్నారు. చూడబోతే ప్రజా సమస్యలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. వాటి మీద బీజేపీ నాడూ నేడూ కూడా చేసిన ఆందోళనలు పెద్దగా లేవని విమర్శలు ఉన్నాయి. కడుపు కాలి జనం కరోనా వేళ కటకటలాడుతూంటే మతం పేరు చెప్పి రెచ్చగొట్టుడు రాజకీయం చేయడంతో ఉచితానుచితాలు కమలనాధులకే తెలియాలి మరి. నిజానికి బీజేపీకి ఏపీలో గట్టి పట్టు రావాలంటే కేంద్రంతో చెప్పించి ఒప్పించి అర్జంటుగా ప్రత్యేక హోదాను తీసుకురావడమే సరైన విధానం. అది జనంలో ఉన్నబాగా కోరిక. జగన్, చంద్రబాబులను మించాలంటే ఇంతకు మించిన మార్గం బీజేపీకి వేరేది లేదు. అంతే తప్ప గుళ్ళూ గోపురాలు అంటూ రాంగ్ ట్రాక్ పడితే మళ్ళీ చేదు ఫలితాలే వస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు

Related Posts