YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సంక్షేమాన్నే నమ్ముకున్న అధికార పార్టీ

సంక్షేమాన్నే నమ్ముకున్న అధికార పార్టీ

హైదరాబాద్. సెప్టెంబర్ 28, 
హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ప్రచార వేగం పెరింది. దాంతో పాటే హామీల వర్షం కురిపిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటోంది. టీఆర్‌ఎస్‌ ప్రచార బృందానిక సారధ్యం వహిస్తున్న మంత్రి టి. హరీష్‌ రావు ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు ఏకరవు పెడుతున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధనాలను ఎండగడుతున్నారు. అంతేకాదు సరికొత్త హామీలతో జనం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఐదు వేల డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చింది టీఆర్‌ఎస్‌. సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవటానికి ప్రభుత్వం డబ్బు ఇస్తుంది. ఐదేళ్ల క్రితం సీఎం కేసీఆర్‌ ఈ నియోజకవర్గానికి నాలుగు వేల ఇండ్లు మంజూరయ్యాయి. ఈటల రాజేందర్‌ మంత్రిగా ఉండి కూడా ఓక్కంటే ఒక్క ఇల్లు కూడా కట్టించలేకపోయారు. అదే సమయంలో మంత్రిగా పనిచేసిన ప్రస్తుత స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి తన నియోజకవర్గానికి కేటాయించిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారన్నారు మంత్రి హరీష్‌ రావు.హుజూరాబాద్‌కు ఐదు వేల ఇండ్లు మంజూరు చేయటమే కాదు వాటిని కట్టి చూపిస్తుంది. ఇల్లందకుంట మండలంలో సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపుల లోన్‌ ఇంట్రెస్ట్‌ సొమ్ము 3 కోట్ల 14 లక్షల రూపాయలు పంపిణీ చేశారు. టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంది. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతోంది. అందుకే ఏ పార్టీని బలపరచాలో ప్రజలే నిర్ణయించుకోవాల్సి వుంది. గతంలో హామీ ఇచ్చిన విధంగా 25 వేల రూపాయల వరకు వ్యవసాయ రుణాలను తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేసింది. అలాగే 50 వేల రూపాయల లోపు రుణాలను పది రోజులలో మాఫీ అవుతాయి. ఇక లక్ష లోపు రుణాలను ఫిబ్రవరి, మార్చి మధ్య మాఫీ ఖాయం. కరోనా మహమ్మారి కారణంగా తలెల్తిన ఆర్థిక సంక్షోభం మూలంగా రైతు రుణ మాఫీ ఆలస్యమైంది.రుణ మాఫీతో పాటు రైతు బంధు, రైతు బీమాతో ప్రభుత్వం రైతులను ఆదుకుంటోంది. అయితే కేంద్రం మాత్రం డీజిల్‌ ,పెట్రోల్ ధరలు పెంచుతూ వారి నుంచి డబ్బులు పిండుకుంటోంది. అన్నిటిని మించి నూతన వ్యవసాయ చట్టాల ద్వారా మార్కెట్‌ యార్డులను కేంద్రం రద్దు చేసే ఆలోచనలో ఉంది. 450 రూపాయలున్న వంట గ్యాస్‌ ధరని మోడీ సర్కార్‌ వెయ్యి రూపాయలు చేసింది. 250 రూపాయలుండే గ్యాస్‌ సబ్సిడీని 40 రూపాయలకు తగ్గించింది. కానీ బీజేపీ నేతలు వీటిని ప్రస్తావించకుండా హుజూరాబాద్‌ ఓటర్లకు గోడ గడియారాలు, కుట్టుమిషన్లు, గ్రైండర్లు పంచుతున్నారు. డీజిల్‌, పెట్రోల్‌ ధరలు, వంటగ్యాస్‌, వంట నూనెల ధరలు తగ్గిస్తామని ఎందుకు చెప్పట్లేదు అని ప్రశ్నించారు హరీష్‌ రావు.పేదలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, కేసీఆర్‌ కిట్‌, ఆసరా పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. కానీ 17 ఏళ్ల పాటు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి..ఏడేళ్లు మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌ ఇప్పుడు ఆ పథకాలను పల్లీలతో పోల్చారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు లేవు. కానీ తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పదహారు రూపాయల వృద్ధాప్య పెన్షన్‌ ఇస్తుండగా బీజేపీ పాలనలోని గుజరాత్‌ కేవలం 600 రూపాయలు ఇస్తోంది. రాబోవు రోజుల్లో 57 ఏళ్లు దాటిన వారికి కూడా పెన్షన్‌ పొందనున్నారు. నల్లా కనెక్షన్లు ఇచ్చి మహిళల నీటి కష్టాలు తీర్చింది తెలంగాణ ప్రభుత్వం. మిషన్‌ భగీరథ కింద రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికి తాగు నీరు అందిస్తోంది. అలాగే కలేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా జిల్లాలో యాసంగికి కూడా కావాల్సినంత సాగు నీరు ఇస్తోంది. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్‌ ఇస్తోంది. మరోవైపు కేంద్రం రైతుల పంపు సెట్లకు మీటర్లు బిగించాలని చూస్తోంది. అందుకే హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడించి గట్టిగా బుద్ధిచెప్పాల్సిన అవసరం ఉందంటున్నారు మంత్రి హరీష్ రావు. మరి ఆయన మాటలు హుజూరాబాద్‌ ఓటర్లను ఏమేరకు ఆకట్టుకుంటాయో ఎన్నికల తరువాత కానీ తెలియదు

Related Posts