లండన్, సెప్టెంబర్ 28,
యూకేలో సరిపడా డ్రైవర్లు లేక గూడ్స్ రవాణా రంగం అతలాకుతలమైతోంది. ట్రక్ డ్రైవర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దేశంలో హెవీ గూడ్స్వెహికిల్స్నడిపే డ్రైవర్లు లేక రవాణా రంగంపై ఆధారపడి నడుస్తున్న ఇండస్ట్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. పెట్రోల్బంకులకు ఫ్యూయల్తరలించే వాహనాలకు కూడా డ్రైవర్లు లేకపోవడంతో బంకులు మూతపడుతున్నాయి. అంబులెన్స్లు సహా వివిధ వాహనాలు ఫ్యూయల్కోసం బంకులు వెతుక్కుంటూ తిరగాల్సి వస్తోంది. నిత్యావసర సరుకులు సహా వస్తు రవాణాపై చాలా ప్రభావం పడుతోంది. సూపర్ మార్కెట్లు ఖాళీ అవుతున్నాయి. ఆందోళనతో జనం ఎక్కువ మొత్తంలో కొనుక్కుని తీసుకెళ్తున్నరు. ఈ సమస్య నుంచి గట్టెక్కడమే లక్ష్యంగా వివిధ దేశాల నుంచి డ్రైవర్లను రిక్రూట్ చేసుకునేందుకు ప్రభుత్వం టెంపరరీ వీసా స్కీం తీసుకురావడంపై దృష్టి పెట్టింది. వీసా నిబంధనలు సడలించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.దేశంలో ఒక్కసారిగా ట్రక్డ్రైవర్ల కొరత ఎందుకు వచ్చిందనే దానిపై స్పష్టమైన కారణం తెలియడం లేదు. కరోనా పాండమిక్ సహా ఏజ్ ఫ్యాక్టర్తో డ్రైవర్ల కొరత తీవ్రమైందని యూకే గవర్నమెంట్ చెబుతుండగా, బ్రెగ్జిట్తర్వాత ప్రభుత్వం తీసుకొచ్చిన ఇమ్మిగ్రేషన్రూల్స్వల్లే డ్రైవర్ల కొరత ఏర్పడిందని పలు ట్రాన్స్పోర్ట్ సంస్థల మేనేజ్మెంట్లు ఆరోపిస్తున్నాయి. ఈ రూల్స్ప్రకారం.. యూరోపియన్యూనియన్పౌరులు బ్రిటన్‌లో వీసా లేకుండా పనిచేయలేరు. ఇమ్మిగ్రేషన్ రూల్స్ సడలించాలని, అలా చేస్తే యూరోప్ అంతటా డ్రైవర్లను సులభంగా రిక్రూట్ చేసుకోవచ్చని ట్రక్కంపెనీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.ఫ్యూయల్ సరఫరాకు ట్రక్డ్రైవర్ల కొరత నెలకొనడంతో ఆయా సంస్థలు గ్యాస్ స్టేషన్లను మూసివేస్తున్నాయి. యూకేలో 400 గ్యాస్స్టేషన్లు నడిపే ఈజీ గ్రూప్గ్యాస్ కొనుగోళ్లపై ఆంక్షలు పెట్టింది. ఒక్కో వ్యక్తి 30 పౌండ్లకు మించి గ్యాస్ కొనకూడదనే ఆంక్షలు పెట్టింది. ‘దేశంలో ఫ్యూయల్ నిల్వల కొరత లేదు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్నట్లే బ్రిటన్లోనూ డ్రైవర్ల టెంపరరీ కొరతతో ఇబ్బందులు పడుతున్నం’ అని ప్రభుత్వం తెలిపింది. కానీ డ్రైవర్ల కొరతకు బ్రెగ్జిట్ప్యాక్టర్ కూడా కారణమని ప్రభుత్వం ఎక్కడా చెప్పడం లేదు. డ్రైవర్ల కొరతను బ్రిటన్పరిశ్రమల సమాఖ్య అధినేత ‘బ్రెగ్జిట్హ్యాంగోవర్’గా పేర్కొన్నాడు